ఆర్.ఆర్ ఆర్... ప్రస్తుతం అన్ని  ఇండస్ట్రీలలో ఈ సినిమా విడుదల కోసమే ఎదురు చూస్తున్నారు . దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా బాహుబలి సినిమా లాంటి  సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సనిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. కాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కి సంబంధించి  ఎలాంటి  అప్డేట్స్ లీక్ అయిన  అది వైరల్ గా మారిపోతుంది. ఈ సినిమా కోసం అటు  జక్కన  అభిమానులు... ఇటు మెగా అభిమానులు... మరోవైపు నందమూరి అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్  అనే సినిమాలో ఎన్టీఆర్ సరసన  హీరోయిన్ గా సెలెక్ట్ చేయబోతున్నారు అనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది. 

 

 

 

 అయితే తాజాగా చిత్ర బంధం ఈ సస్పెన్స్ కు తెర దించుతూ బ్రిటిష్ బ్యూటీ ఒలివియాను  ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసింది చిత్రబృందం. అయితే ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేస్తామని ఇప్పుడు నుంచి మరింత వేగంగా చిత్రీకరణ జరుపుతామని తెలిపారు. అయితే ఒకే రోజు ఈ సినిమాకు సంబంధించి చాలా అప్డేట్స్ ని  ప్రకటించింది చిత్రబృందం . సినిమాలు మరో ఇద్దరు ఫారెన్ యాక్టర్స్  కూడా నటించబోతున్నట్లు ఆర్ఆర్ఆర్  చిత్ర బృందం వెల్లడించింది. ఐరిష్ బ్యూటీ అలిసన్ డ్యుడి  కీలకపాత్రలో నటించబోతుండగా...  మరో హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్సన్ విలన్  పాత్రలో నటిస్తున్నారు. కాగా  వీరు కూడా త్వరలో షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 అంతే కాకుండా ఈ సినిమా ఒకేసారి పది భాషల్లో విడుదల కాబోతుందని 2020 సంవత్సరంలో విడుదల కాబోతుంది అంటూ చిత్రబృందం నుండి ఓ ప్రకటన  వచ్చింది . కానీ ఈ చిత్రం జూలైలో విడుదల అవుతుందని మాత్రం ప్రకటించలేదు.దీంతో  అభిమానుల్లో  మరో కొత్త కన్ఫ్యూషన్  మొదలైంది. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది. ఎందుకంటే దర్శక ధీరుడు రాజమౌళి క్వాలిటీ విషయంలో  ఎక్కడా కాంప్రమైజ్ ఎవ్వరు  అన్న విషయం అందరికి తెలిసిందే... సినిమా ఆలస్యం అయినా పర్లేదు కానీ క్వాలిటీ మాత్రం ఎక్కడ తక్కువ కాకుండా   చూసుకుంటారు. రాజమౌళి సినిమాలంటే వాయిదా పడుతూనే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ప్రేక్షకులకు మరోసారి ఆలోచన చేస్తున్నారు. కాగా సినిమాలు ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా... రామ్ చరన్ అల్లూరి సీతారామ పాత్రల్లో నటిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: