ప్రస్తుతం యూత్ అంతా ఇష్టపడే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలతో అతనికి స్టార్ స్టేటస్ ఇచ్చేశారు తెలుగు ఆడియెన్స్. కేవలం తెలుగులోనే కాదు విజయ్ దేవరకొండ క్రేజ్ సౌత్ అంతాటా ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో కూడా పాకిందని తెలిసిందే.

 

చేస్తున్న సినిమాలే కాదు అతని వేషధారణం.. మాట్లాడే తీరు అన్ని యూత్ ఆడియెన్స్ కు బాగా ఎక్కేస్తున్నాయి. అందుకే అనతికాలంలోనే అతనికి సూపర్ ఇమేజ్ వచ్చేసింది. ఈ ఇయర్ డియర్ కామ్రేడ్ తో నిరాశపరచిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో రాబోతున్నాడు. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 ఫిబ్రవరి 14న రిలీజ్ అంటున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు విజయ్. ఇదిలాఉంటే రౌడీ హీరోకి ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అంటున్నారు. పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో శివగామి రమ్యకృష్ణకు సూపర్ రోల్ ఇచ్చారట. ఆ పాత్ర దిశా నిర్దేషం లేకుండా తిరుగుతున్న హీరో విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చి ఓ లక్ష్యాన్ని పెడుతుందట.

 

సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపిస్తాడట విజయ్ దేవరకొండ. రీసెంట్ గా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కోసం విజయ్ దేవరకొండ థాయ్ లాండ్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన పూరి విజయ్ దేవరకొండ సినిమాతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: