బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా ప్రతిష్టను శిఖరాగ్రాన నిలబెట్టిన సినిమా బాహుబలి. ఈ సినిమా తో ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమాపై పడింది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాల మార్కెట్ పరిధి బాగా పెరిగింది. ఓవర్సీస్ లో కూడా విపరీతంగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. అయితే రాజమౌళి సెట్ చేసిన పాన్ ఇండియా టార్గెట్ ను అందుకోవాలని చాలా మంది దర్శకులు ప్రయత్నం చేశారు.

 

ఈ ప్రయత్నంలో కొందరు బోల్తా పడగా మరికొందరు కొంతమేరకు మాత్రమే విజయం సాధించగలిగారు. ఎవరెన్ని చేసినా బాహుబలి స్థాయిని అందుకోలేరన్నది మాత్రం వాస్తవం. బాహుబలి లాంటి అద్భుతమైన ఫీట్ ని అందుకోవాలంటే రాజమౌళికే సాధ్యం. అందుకే ఇప్పుడు తన తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్ తో ఆ ఫీట్ ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడని అనిపిస్తోంది. బాహుబలి సినిమా ద్వారా ఇండియన్ సినిమాకి పేరు తీసుకొచ్చిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడని అనిపిస్తుంది.

 

డెభ్బై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కీలక పాత్రలైన విలన్లను నిన్న పరిచయం చేశాడు. రాజమౌళి సినిమాలో విలన్లు చాలా బలంగా ఉంటారు. విలన్ బలంగా ఉంటేనే హీరోకి బలం పెరుగుతుందని నమ్మే రాజమౌళి ఈ సినిమాలో విలన్లుగా ఐరీష్ కి చెందిన రే స్టీవెన్ సన్ ని తీసుకున్నాడు. అలాగే లేడీ విలన్ గా ఐరిష్ వనిత అయిన అలిసన్ డూడీని తీసుకున్నారు. ఈ క్యాస్టీంగ్ చూస్తుంటే ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో తన పవరేంటీ చూపెట్టబోతున్నాడన్ని తెలుస్తుంది.

 

హాలీవుడ్ నటులతో మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం హిందీతో పాటు మొత్తం పది భాషల్లో విడుదల అవుతుంది. మరి మిగతా ఆ ఐదు  భాషలేంటనేది ఇంకా తేలలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: