వర్మ తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమా రెండవ ట్రైలర్ ను యూట్యూబ్ లో నిన్నే విడుదలయ్యింది. అయితే ఈ సినిమాలో వర్మ .. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తేవడం గమనార్హం. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్ సహా మరికొంత మంది పాత్రలపై డైరెక్ట్ గానే ఎటాక్ చేసాడు వర్మ. వర్తమాన రాజకీయాలను హైలైట్ చేస్తూనే తనదైన శైలి కామెడీని పండించే ప్రయత్నం చేసాడు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో టీడీపీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేమని ఇటీవల తామరతంపరగా కథనాలొచ్చాయి.. ముఖ్యమైన నేతలంతా పార్టీని వదిలి బయటకు వెళ్లిపోతున్నారు. దీనంతటికీ కారణం చంద్రబాబు వారసుడు లోకేష్ని సీఎంని చేయలనుకోవడమే కారణమని నేరుగానే విమర్శించారు కొంత మంది.

 

పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఆ పార్టీ మనుగడ బాగుపడుతుందని చాలా మంది ఇప్పటికే చెప్పుకొచ్చారు. పార్టీ పగ్గాలు భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్లడం ఖాయమనే కథనాలు ఇప్పటికే ప్రజల్లో చర్చకు దారి తీసాయి. తాజాగా సెకెండ్ ట్రైలర్ లో ఆ పాయింట్  కూడా టచ్ చేసాడు వర్మ. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం చంద్రబాబు పాత్రధారిలో నిరాశ- నిస్పృహలను వర్మ చూపించాడు. ఈ ఐదేళ్లు కష్టమే. వచ్చే ఎన్నికలకు చంద్రబాబుకు 75 ఏళ్లు వచ్చేస్తాయి. వయసు మీద పడుతుంది. అప్పటికి పార్టీని నడిపించే సామర్ధ్యం ఉండదని బాబు తీరును ఎలివేట్ చేసాడు. ఈలోగా ఆ పార్టీనీ బుడ్డోడు లాగేసుకోకపోతే ఏమవుతుందోనని సందేహం వ్యక్తం చేస్తారు పార్టీ నేతలు.



ఇదంతా ఇప్పుడు వర్మ తన సినిమాలో హైలైట్ చేయడం విశేషం. చివరిగా దీనంతటకీ కారణం లోకేష్ అనే హైలైట్ చేసాడు. ఈ పాయింట్ సినిమాలో వేడెక్కించే అంశమే. ఇప్పటికే పార్టీ పగ్గాలు తారక్ కి  అప్పగిస్తే టీడీపీ కి మంచి  భవిష్యత్ ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకత అందుకు కారణమా?  లేక చంద్రబాబు పార్టీని నడిపే శక్తి లేకనా? అన్నది సెకెండరీ గానీ ఊహించనవి విధంగా వర్మ తారక్ రోల్ ని పరోక్షంగా టచ్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: