మనిషి జీవితంలో పెళ్లంటే నూరెళ్లపంట అంటారు పెద్దలు కాని కొందరి జీవితాల్లో పెళ్లంటే మున్నాళ్ల ముచ్చటలా మిగిలిపోతుంది. ఇది సంపన్నుల కుటుంబాల్లో కానివ్వండి. లేదా సినిమా ఫీల్డ్‌లో కానివ్వండి విడాకులనేది ఓ ఫ్యాషన్‌గా మారింది. పిల్లలు పుట్టాక కూడా విడాకులిచ్చి మరొకరితో డెటింగ్ చేస్తున్నారు. అసలు పెళ్లంటే విలువలేక వలువలా మారింది.

 

 

ఒంటిమీది బట్టలను మార్చినట్లుగా కొందరైతే తమ ప్రియుల్లను, ప్రియురాల్లను మారుస్తున్నారు. ఇది సమాజంలో ఓ పాడు సంసృతిలా మారింది. కాని ఇలాంటి వారికి స్వేచ్చ కోసం ఏమైనా చేస్తాం మా హక్కును కాదనడానికి మీరెవరు అని ప్రశ్నించేలా ఈ అలవాటు మిగులుతుంది. ఇకపోతే మరో బాలీవుడ్ జంట విడాకులకు రెడీ అయ్యారు. విడాకులూ తీసుకున్నారు కూడా తమ 21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులు అనే కాగితాలతో స్వస్తి పలికారు కూడా అతనే బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌.

 

 

తన మొదటి భార్య జెసియా నుండి పరస్పర అంగీకారంతో అర్జున్‌ విడాకులు తీసుకున్నారు. తామిద్దరం విడిపోతున్నామని గతేడాది ప్రకటించినప్పటికి తాజాగా బంద్రాలోని ఓ కోర్టు వీరిద్దరికి ఈ రోజు అధికారంగా విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా వీరిద్దరు కుమార్తెలు మహిక, మైరా.. ఇక నుంచి తల్లి జెసియా వద్దనే ఉంటారని కోర్టు పేర్కొంది. విడాకులపై స్పందించమని కొందరు విలేకర్లు అర్జున్‌ను కోరగా ఆయన ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

మరోవైపు అర్జున్‌ ప్రస్తుతం విదేశీ మహిళ గాబ్రియెల్లాతో డేటింగ్‌లో ఉంటున్నాడు. ఇటీవల వీరిద్దరికి ఓ బాబు కూడా జన్మించాడట.. ఇక పిల్లలను చూసుకోవలసిన బాధ్యతను జెసియా కు అప్పగించిన కోర్టు ఏమైన అప్పగింతలుంటే సమర్పించుకోవాలని ఇతర చట్టబద్దమైన అంగీకారాలు పిల్లల పోషణ నిమిత్తం  ఏర్పాటు చేసింది. కాని నిజంగా అన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు విడిపోవాలన్నంతా భారం ఎవరికి ఎవరు అయ్యారో  తెలియదు అనుకుంటున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: