టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుంటే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కాగా చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ని రెండు రోజుల క్రితం సెలక్ట్ చేసి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

 

ఇక ఆమెతో పాటు సినిమాలోని మెయిన్ విలన్ మరియు లేడీ విలన్ పాత్రధారుల లుక్స్ కూడా రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్, ఎట్టిపరిస్థితుల్లో సినిమాను వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేసి తీరుతాం అంటోంది. ఇకపోతే ఎన్టీఆర్ హీరోయిన్ అయిన ఒలీవియా పెద్దగా సోషల్ మీడియా అకౌంట్స్ ని వాడరని, తన ట్విట్టర్ అకౌంట్ లో ఉన్న ఫాలోవర్స్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. 

 

అయితే ఆమె ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అవడంతో, కేవలం రెండు రోజుల్లోనే ఏడు వేల నుండి ఆమె ఫాలోవర్లు ఏకంగా ఇరవై వేలకుపైగా చేరారు. ఈ పరిస్థితి చూస్తుంటే రాబోయే అతి కొద్దిరోజుల్లోనే ఆమె ట్విట్టర్ అకౌంట్ యాభై వేల మంది ఫాలోవర్స్ ని సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు నెటిజన్లు ఈ విషయమై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఒలీవియా కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరి ఎంతో భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: