బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ కోపం ఎప్పటికప్పుడు అతనికి చాలా చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇది వరకే ఎన్నో వివాదస్పద వాఖ్యలు చేసిన సల్మాన్‌కు కోపం వస్తే అసలు ఆగలేడు. ఒక్కోసారి ఖాన్‌ కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఇదే కాకుండా ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనే టాక్ కూడా ప్రచారంలో ఉంది..

 

 

ఇక ప్రస్తుతం ఆయన సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న చిన్నారి పెళ్లికూతురు హీరో సిద్ధార్థ్ శుక్లాపై సల్మాన్ మండిపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటే అసలే కోపిష్టి అయినా సిద్ధార్థ్‌ హౌజ్‌లో ఉన్నవారిపై అరవడం, వారిపై చేయి చేసుకోవడం, అసహ్యంగా మాట్లాడటం వంటివి చేస్తున్నాడట. దీంతో సిద్ధార్థ్‌ ప్రవర్తను ఖండిస్తూ సల్మాన్ వార్నింగ్ ఇచ్చాడట..

 

 

అది ఎంత సీరియస్‌గా అంటే నీ ప్రవర్తన ఏంటీ? అసలు నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్? ఇంకోసారి ఇదే విధంగా హౌజ్‌లో ప్రవర్తించావంటే ఊరుకోను. నిన్ను ఈ హౌజ్‌ నుంచి బయటకు గెంటేస్తాను. అంతే కాకుదు నువ్వు హౌజ్‌ నుండి బయటకు వెళ్లాక కూడా ఇండస్ట్రీలో ఎవరు నీకు పని ఇవ్వకుండా చేస్తాను. ఈ షో నుంచి నేను ఎవరినైనా ఎలిమినేట్ చేయాలనుకుంటే అది కచ్చితంగా నువ్వు అవుతావ్. హౌజ్‌లో నీ ప్రవర్తన వల్ల బాధపడ్డ వారందరికీ నేను న్యాయం చేస్తాను’ అని వెల్లడించారు.

 

 

అయితే ఇప్పుడు ప్రసారం అవుతున్న బిగ్ బాస్‌ షో గత సీజన్లతో పోలిస్తే అంత ఆసక్తికరంగా సాగడం లేదట. ఎప్పుడైతే సిద్ధార్థ్ శుక్లా ఇతర కంటెస్టెంట్లతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి టీఆర్‌పీ రేటింగ్స్ దూసుకెళుతున్నాయని. అందుకే సిద్ధార్థ్ దురుసుగా ప్రవర్తిస్తున్నా కూడా ఇప్పటి వరకు అతన్ని కాకుండా సల్మాన్ ఖాన్ ఇతర కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: