రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే డెభ్బై శాతం షూటింగ్ జరుపుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం  జులై 20 వ తారీఖున విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పీరియాడిక్ డ్రామా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.

 

అందువల్ల షూటింగ్ జరుపుకున్న తర్వాత కూడా చాలా సమయం పడుతుంది. అందుకని సినిమాని త్వరగా పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా, చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటించనుంది.

 

ఈ మేరకు అధికారికంగా వెల్లడి చేసింది చిత్ర బృందం. ప్రముఖ హాలీవుడ్ నటులు విలన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరగనుందట. రామ్ చరణ్, ఆలియా భట్ ల మధ్య ఉండే రొమాంటిక్ పాట కోసం హైదరాబాద్ లో సెట్ కూడా వేసారని సమాచారం. అలాగే ఎన్టీఆర్, ఒలివియా మోరిస్ ల మధ్య కూడా పాట ఉంటుందట. వారు కూడా మరికొద్ది రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

 

ఇంత వేగంగా పగలు రాత్రి అని తేడా లేకుండా చిత్రీకరణ జరుగుతుండడంతో రాజమౌళి తాను చెప్పినట్టుగా సినిమాని జులై 20 వ తేదీన విడుదల చేసేలానే ఉన్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషలతో పాటు మొత్తం  పది భాషల్లో ఈ సినిమా వస్తుందట. మరి ఈ సినిమా కూడా బాహుబలి మాదిరిగా మంచి విజయం సాధించాలని అనుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: