సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి నిన్న అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి అత్యధిక లైక్స్, వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నారు. ఇక నిన్న రిలీజ్ అయినఈ సినిమా టీజర్ ని బట్టి చూస్తుంటే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. 

 

ఇకపోతే గత కొద్దీ సినిమాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా సీరియస్ గా ఉండే పాత్రలనే ఎంచుకుంటూ ఉండడంతో, ఆయన ఫ్యాన్స్ కూడా మహేష్ నుండి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీని ఆశిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు పూర్తిగా తీర్చి, అలానే ప్రేక్షకులను కూడా పూర్తి స్థాయిలో మెప్పించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుండి తొలి సాంగ్ ని మరొక వారం రోజుల్లో యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నేడు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

 

ఇక ఆ సాంగ్, హీరో మరియు హీరోయిన్ల మధ్య వచ్చే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అని సమాచారం. అలానే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాలో పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని టాక్. మరి ఇప్పటికే టీజర్ తో సినిమాపై ప్రేకకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్న సినిమా యూనిట్, రేపు సాంగ్స్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు మరింతగా పెరుగుతాయని, అలానే తప్పకుండా సినిమా కూడా వాటిని అందుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయబోతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: