ప్రస్తుతం ట్రెండింగ్‌లో వున్న సినిమా 'జార్జ్‌రెడ్డి'. జీవన్‌రెడ్డి దర్శకుడు. అప్పిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, దాము రెడ్డి నిర్మాతలు. సందీప్‌మాధవ్‌ టైటిల్‌రోల్‌ ప్లే చేశాడు. ఈ సినిమా విడుదలకుముందు ఎంత క్రేజ్‌ వచ్చిందో. విడుదల తర్వాత ప్రీమియర్‌షో వేశాక. కాస్త నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. అర్థరాత్రి ఒంటిగంటకు ప్రివ్యూ చూసిన వారు వెంటనే రివ్యూలు పెట్టేసి నెగెటివ్‌గా రాయడంతో ఓపినింగ్‌ రోజు మాకు టెన్షన్‌ పట్టుకుందని చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి వాపోతున్నారు.

 

సన్నిహితులతో మాట్లాడుతూ... ప్రివ్యూ అనవసరంగా ముందుగా వేశామోనని భయపడ్డాడుకూడా. కానీ సినిమా విడుదలయ్యాక.. ఓవర్‌సీస్‌లో మంచి అప్లాజ్‌ వచ్చింది. ఇక్కడ ఆంధ్రాలో బాగా ఓపెనింగ్స్‌ వచ్చాయి. తెలంగాణాలో అప్పటికే బుక్‌ చేసుకున్నవారితో ఆదివారం వరకు ఫుల్స్‌ అయ్యాయి. ఈ చిత్ర కథ గురించి వివరిస్తూ.. అసలు జార్జ్‌రెడ్డి కథను ఎందుకని సరిగ్గా తీయలేకపోయారని మీడియా ప్రశ్నిస్తే... అప్పుడు ఏం జరిగిందో 1968-70లోని వ్యక్తులు ఇప్పుడు ఎవ్వరూ అందుబాటులో లేరు. ఎక్కడో రాసిన పుస్తకాలు, లైబ్రరీలో దొరికిన ఆధారాలుతో సినిమాటిక్‌గా చెప్పానని దర్శకుడు వివరించారు. తానూ ఉస్మానియా విద్యార్థినేనని అక్కడ పరిశోధించి చేశామని దర్శకుడు పేర్కొన్నారు.

 

 కానీ, సినిమాలో ఏదో మిస్‌ అయిందనేదానికి ఎవరి బయోపిక్‌ తీసినా ఎవరినో ఒకరిని టార్గెట్‌ చేయాలి. నేను అలా చేయదలచుకోలేదని అన్నారు. జార్జ్‌రెడ్డిని చంపింది సినిమాలో లలాన్‌సింగ్‌ అనే వ్యక్తి. అప్పట్లో ఉస్మానియాను లలాన్‌సింగ్‌ అన్నదమ్ములు ముగ్గురు కలిసి శాసించేవారు. మాఫియాలా మారి విద్యార్థుల్ని హింసించేవారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రస్తుతం ఓల్డ్‌సిటీలో వున్న రాజాసింగ్‌ వారసుడు. అంటే రాజాసింగ్‌... లలాన్‌సింగ్‌కు మనవడు అవుతాడు. ఈ విషయాన్ని దర్శకుడిముందు వుంచితే... అది నేను చెప్పలేను. అన్నీ నిజాలు చెబితే.. నన్నీపాటికి టార్గెట్‌ చేసేవారు. అందుకే నాకున్న పరిమితులు మేరకు సినిమా తీశానని తేల్చిచెప్పారు. చరిత్ర గురించి ఒకటిన్నర సంవత్సరాలు అధ్యయనం చేసి కథను రెడీ
చేసుకున్నాను. నేను కలిసిన వారందరూ  చెప్పిన కథలు లలో చాలా వ్యత్యాసాలు చూసాను. కలిసిన  ప్రతి ఒక్కరి దగ్గరా ఒక కథ ఉంది. అందుకే నేను నమ్మిన కథను చరిత్రలోని  వాస్తవ సంఘటలను ఆదారంగా తీసుకొని జార్జిరెడ్డిని ప్రజెంట్ చేసాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: