విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కించిన సినిమా జార్జ్ రెడ్డి. దళం ఫేం జీవన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జార్జ్ రెడ్డి పాత్రలో నటించాడు సందీప్ మాధవ్. ఇదివరకు వర్మ తీసిన వంగవీటి సినిమాలో కూడా అతనే లీడ్ రోల్ గా చేశాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తర్వాత ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది.

 

ఇక ఆ తర్వాత మెగా హీరోలు చిరు, పవన్సినిమా గురించి మాట్లాడటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది. అయితే చిన్న సినిమాగా వచ్చినా సరే మీడియా ఈ సినిమాపై మంచి కవరేజ్ ఇచ్చింది. శుక్రవారం గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు కలక్షన్స్ షాక్ ఇచ్చాయి.

 

వరల్డ్ వైడ్ గా జార్జ్ రెడ్డి మొదటిరోజు 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు 61 లక్షల షేర్ రాబట్టిన జార్జ్ రెడ్డి వరల్డ్ వైడ్ గా 73 లక్షలు మొదటిరోజు షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఏరియాల వారిగా జార్జ్ రెడ్డి ఫస్ట్ డే వసూళ్ల వివరాలు చూస్తే 

 

నైజాం : 26 లక్షలు

సీడెడ్ : 7 లక్షలు

ఈస్ట్ : 4 లక్షలు

వెస్ట్ : 3.1 లక్షలు

కృష్ణా : 4.5 లక్షలు

గుంటూరు : 4 లక్షలు

నెల్లూరు : 2.1 లక్షలు 

ఏపి/తెలంగాణ : 63 లక్షల షేర్ రాబట్టింది.

ఫస్ట్ డే కలక్షన్స్ అంత గొప్పగా లేకున్నా సినిమాకు వచ్చిన టాక్ తో కచ్చితంగా వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. వసూళ్లు ఎలా ఉన్నా విద్యార్థి నాయకుడి జీవిత కథను తెరకెక్కించిన చిత్రయూనిట్ ను మెచ్చుకోవాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: