సినిమా స్టార్లకి ఉండే క్రేజే వేరు. వాళ్లకుండే అభిమానుల వల్లే ఆ హీరోలకి స్టార్ స్టేటస్ వస్తుంది. స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ల దగ్గర  పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ అభిమానంతోనే మొదటిరోజు కలెక్షన్లు ఎక్కువగా వస్తాయి. హీరోలు కూడా అభిమానులని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తారు. వారిని మెప్పించడానికే ప్రయత్నిస్తారు. అలా మెప్పించగలిగినపుడు ఆ అభిమానం మరింత పెరుగుతుంది.

 

ముఖ్యంగా దక్షిణాదిన సినిమా హీరోలకి ఉండే ఆరాధన చాలా ఎక్కువ. ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ సినిమా హీరోల పట్ల ఎక్కువ అభిమానం చూపిస్తారు. హీరోల పుట్టిన రోజున రక్తదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. అయితే తమిళనాడులో ఇది మరీ ఎక్కువ. అక్కడ రాజకీయ నాయకులు సైతం సినిమా రంగానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు. అయితే తాజాగా ఒక హీరో మైనపు విగ్రహం తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ ప్రముఖ టూరిస్ట్ మ్యూజియం నందు ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఇటీవల బిగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచిఒ విజయం అందుకున్నాడు హీరో విజయ్.  తమిళ ప్రజలు దళపతి విజయ్ గా ప్రేమగా పిలుచుకుంటారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 250కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయానందంలో ఉండగానే మైనపు విగ్రహంతో మరో ఘనత సాధించాడు విజయ్. ఈ మైనపు విగ్రహాన్ని చూడడానికి విజయ్ అభిమానులు కన్యాకుమారి తరలి వస్తున్నారు.

 


ఆ విగ్రహం పక్కన ఫోజులిస్తూ ఫోటోలు దిగుతున్నారు. విజయ్ ప్రస్తుతం తన 64వ చిత్రాన్ని ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ ఆల్రెడీ జరుగుతుండగా కర్ణాటకలో ఓ జైలుకి సంబందించిన సెట్ ఏర్పాటు చేశారట. అక్కడ విజయ్ సేతుపతి మరియు విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: