వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన 'దేవదాసు' సినిమాలో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' సినిమాతో అదిరిపోయే సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సెకండ్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఇలియానాకి ఇండస్ట్రీలో భారీ భారీ అవకాశాలు రావడం జరిగాయి. దీంతో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి పక్కన నటించిన హీరోయిన్ ఇలియానా పాపులారిటీ సౌత్ మొత్తం పాకింది. ముఖ్యంగా తెలుగు కుర్రకారు అయితే ఇలియానా నడుము అందాలకి ఫిదా అయిపోయారు. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న ఇలియానాతో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు సినిమాలు చేయడానికి తమ సినిమాల్లో హీరోయిన్ గా ఒప్పించడానికి అప్పట్లో క్యూ కట్టారు.

 

అయితే విపరీతమైన క్రేజ్ ఫాలో ఏర్పడిన సందర్భంలో ఇలియానా బాలీవుడ్ వైపు అడుగులు వేయటం జరిగింది. ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఇలియానా చూపు పడిందో...కెరియర్ క్రమక్రమంగా డౌన్ ఫాల్ అవ్వటం ప్రారంభించింది. ఒక్క సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సరైన గుర్తింపు తీసుకు రాకపోవడంతో తిరిగి తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ వైపు చూసిన గత ఏడాది మాస్ మహారాజ రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోని లో హీరోయిన్ గా నటించింది.

 

 సినిమాలో ఇలియానా చాలా లావుగా కనపడటంతో..ఇలియానా ఫిజిక్ పై భయంకరమైన కామెంట్లు రావడంతో..ఇలియానా ఫుల్ గా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. డిప్రెషన్ కారణంగా తరచుగా నిద్రమాత్రలు తీసుకునేది, దీనితో శరీరంపై నియంత్రణ కోల్పోయి లావైపోయిందని అంటున్నారు. ఆ సమయంలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. తాజాగా ఈ వార్త ఇటీవల బయటపడటంతో సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: