సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు కొనటానికి ఎగబడేవారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉండే మార్కెట్ రజనీకాంత్ సినిమాలకు ఉండేది. అయితే గత కొంత కాలం నుండి రజినీకాంత్ చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మరోపక్క రాజకీయాల్లోకి రజినీకాంత్ వెళ్లిపోతున్నట్లు వార్తలు రావడం అదేవిధంగా వయసు మీద పడటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ సినిమాలకు మార్కెట్ తగ్గినట్లు తాజా పరిస్థితులు మరియు పరిణామాలను బట్టి తెలుస్తుంది. విషయంలోకి వెళితే మురుగదాస్ దర్శకత్వం రజనీకాంత్ నటించిన 'ధర్భర్' సినిమా కొనడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వెనకడుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, మనోబాలా, సుమన్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ఆడియో కార్యక్రమం డిసెంబర్ 7వ తేదీన నిర్వహించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా డిసెంబర్ 12వ తారీకు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి రజినీకాంత్ శ్రీకారం చుట్టినట్లు తమిళ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.

 

ఇటువంటి నేపథ్యంలో రజినీకాంత్ సినిమా మార్కెట్ కి డౌన్ఫాల్ రావటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా రజినీకాంత్ మార్కెట్ గత మూడు సంవత్సరాల నుండి సరైన సినిమాలు లేక చేసిన సినిమాలు తమిళ సినిమా ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడడంతో ఈ పరిస్థితి దాపురించిందని కొంతమంది ట్రేడ్ వర్గాలకు చెందినవారు కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దర్బార్ సినిమా ఏ స్థాయిలో విడుదల అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: