ఆమె హాట్ బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే ఎన్నో హ్రుదయాలను కొల్లగొట్టేసింది. హార్ట్ అటాక్స్ తెప్పించేసింది. హార్టులను బ్రేక్ చేస్తూ అదే సయ్యాటగా తెగ  మురిసిపోయింది. అందంతో చెలగాటమే ఆడి యువ గుండెల్లో చిచ్చు పెట్టింది, రెచ్చగొట్టింది. కిర్రాకు పుట్టించేసింది. ఆమె బారిన పడి మైమరచిపోయిన కుర్ర కుమారాలు ఎందరో.

 

ఆమె స్వీట్ బ్యూటీ ఇలియానా. ఆమె దేవదాస్ మూవీలో ఫస్ట్ నటించింది. ఇలియానా ఆ సినిమా తరువాత కుర్రోళ్ళను వెర్రోళ్ళను చేసేసింది. నిజంగా వారు  దేవదాసులే  అయ్యారు. ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇలియానా ఓ దశలో స్టార్ స్టాట‌స్ అనుభవించింది. ఆమెను పక్కన పెట్టుకుని సినిమాలు చేయాలని స్టార్ హీరోలు కాయలు కాచేలా ఎదురుచూశారు.

 

ఇలియానా డిమాండ్ కూడా అప్పట్లో అలా ఇలా లేదు. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సైతం రెడీ అయిన రోజులవి. సరిగ్గా ఇక్కడే ఇలియానా రాంగ్ స్టెప్ వేసింది. ఆమె  ఆస్ట్రేలియా కు చెందిన ఆండ్రూ అనే ఫోటో గ్రాఫర్ ప్రేమలో పీకల్లోతు కూరుకు పోయింది. అది ఆమె కు తీరని వేదనను మిగల్చటమే కాదు అనారోగ్య సమస్యలతో  ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేసిందన్న షాకింగ్ నిజం ఆమె తాజాగా  వెల్లడించింది.

 

ఇలియానా అతనితో ప్రేమ  బ్రేకప్ అయ్యాకా ఆ నరకాన్ని భరించలేక మానసిక వేదనకు గురి అయిందంట. ఆమె రోజుకు 12 కి పైగా మాత్రలు వేసుకుంది. ఆమె ఫ్యాన్స్ కి నమ్మబుద్ధి కావడంలేదు కానీ అదే నిజం ఇక ఆమె ఈ సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చినా వదిలేసుకుందిట. తన బాధను చెప్పుకోలేక ఏకాంతంగా ఎంతో కాలం బతికిందట. ఈ లోగా శరీరంలో మార్పులు రావడంతో ఆమె లావు కూడా అయిపోయింది.

 

ఇలా పూర్తి డిప్రెషన్ తో ఇలియాన పడ్డ బాధలన్నీ గుదిగుచ్చి ఇటీవల వివరిస్తూంటే బాధ అనిపించకమానదు. ఏది ఏమైనా కూడా పగవాడికి కూడా రాకూడని బాధనే ఇలియానా అనుభవించింది. మళ్ళీ ఆమె ఇపుడు కొంత మారింది. మామూలు జీవితంలోకి వచ్చింది. ఇకనైనా ఇలియానా తనదైన నటనలో మరితంగా దూసుకుపోవాలని అంతా కోరుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: