బాలీవుడ్ లో ఇంటర్నేషనల్ హాట్ అండ్ సెక్సీ గా ఉన్న బ్యూటీస్ లిస్టు లో సోఫీ చౌదరి చాలా ప్రత్యేకం. ఈ బ్యూటీ భారత మూలాలు ఉన్న బ్రిటిష్ పౌరురాలు అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన ఈ సెక్సీ లేడి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగు సినిమాలో ఒక ఐటెం సాంగ్ తో ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో 'లండన్ బాబు' పాటకు స్టెప్పులేసింది. అంతర్జాతీయ అందం కావడంతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలతో హీటు పెంచుతూ జనాలకు కాక రేపుతోంది.

ఈ మధ్య సోఫీ తన ఇన్స్టా ఖాతా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో త్రో బ్యాక్ అని క్యాప్షన్ లో చెప్పేసింది. అంటే పాతదే.  మాల్దీవ్స్ లో నలదు ద్వీపంలో తీయించుకున్న ఫోటోనే ఇది. ఫోటోలో నలుపు రంగు డిజైన్ ఉన్న బికినీలో ఒక వైపుకు నిలబడి కెమెరా వైపు కు మొహం తిప్పి మరీ సెక్సీ పోజిచ్చింది. బికినీ అందంగా ఉంది.. పైన పారదర్శకంగా ఉండే చున్నీ లాంటి దాన్ని చేత్తో అలా పట్టుకుని వయ్యారాలు పోతోంది. జుట్టు బ్రౌన్ షేడ్ లో ఉండడంతో హాట్ నెస్ మరింతగా పెరిగింది. మొహంలో హావ భావాలు కూడా యమా ఘాటుగా ఉన్నాయి. అయినా ఇంత హాట్ గా కనిపించేందుకు ఎంత కష్టమైనా ఎక్సర్ సైజులు చేస్తోందో.. ఎంత కఠినమైన డైట్లు ఫాలో అవుతోందోనని నెటిజన్లు నివ్వెరపోతున్నారు. 

ఈ రేంజ్ లో ఉండే బికిని ఫోటోల కు స్పందన ఓ రేంజ్ లో ఉంటుంది కదా. అలానే ఈ ఫోటోకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  లైక్స్ తో.. కామెంట్లతో నెటిజన్లు రఫ్ఫాడించారు. "సెక్సీ లేడీ".. "పర్ఫెక్ట్ బికినీ షేప్".. "సోఫీ ఆన్ ఫైర్".. "బ్లాక్ బికినీ లో మ్యాజిక్".. అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయాని కి వస్తే సోఫీ చేతిలో ప్రస్తుతం ఆఫర్లేమీ లేవు. అయితే ఎలాంటి రోల్ చేయడానికైనా సై అంటూ బాగానే అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మరి సోఫీ వేసిన ఈ వెరైటి బికిని షో తో నైనా ఓ అఫ్ఫర్ వచ్చి తన ఒళ్ళో పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: