టాలీవుడ్ లో సెకండ్ హీరో, క్యారెక్టర్స్ ఆర్టిస్టులుగా చేసే హీరోల లిస్ట్ చాలా పెద్దదే. మంచి స్టార్ డమ్ అందుకోలేక .. మార్కెట్ స్థాయిని పెంచుకోలేక సతమతమయ్యే లిస్ట్ లో కనీసం అరడజను పైగా హీరోలు ఉన్నారు. ఈ విషయం గమనిస్తే అందరికి తెలుస్తుంది. చాలా సినిమాల్లో సెకండ్ హీరో.. నెగటివ్ హీరో వంటి పాత్రల్లో నటించి గత కొంత కాలంగా ఆకట్టుకుంటున్న చాలా మంది ఒక స్టార్ ఇమేజ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. అయితే ఎందుకనో ఆ మెట్టు దాటి పై మెట్టు ఎక్కలేకపోతున్నారు.

 

ఈ లిస్ట్ లో ముందు వరుసలో నిలిచిన హీరో నితిన్. త్రివిక్రమ్ 'అ..ఆ' లాంటి సినిమాతో నితిన్ ని 50 కోట్ల క్లబ్ లో చేర్చినా ఆ తర్వాత మళ్లీ అదే రేంజ్ మార్కెట్ ని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. నితిన్ ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోగా సెటిల్ అవలేకపోయాడు. నాగశౌర్య పరిస్థితి కూడా అంతే.. ఛలో తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నా ఆ తరువాత చేసిన సినిమాతో మళ్లీ కిందకి జారి పడ్డాడు. నిఖిల్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. శ్రీ విష్ణు కూడా పడి లేస్తూనే వున్నాడు. వీళ్ళతో కంపేర్ చేస్తే శ్రీ విష్ణు కాస్త బెటరని చెప్పాలి. ఇక జ్యోతి లక్ష్మీ లో నటించిన సత్యదేవ్ కి మంచి బేస్ వాయిస్ వున్నా ఆకట్టుకోలేక తనకు వచ్చిన సినిమా చేసుకుంటూ వెళుతున్నాడే తప్ప నెక్ట్ లెవెల్ కి మాత్రం వెళ్లలేకపోతున్నాడు. సందీప్ మాధవ్ (సాండీ) అడపాదడపా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచుకునే పనిలో ఉన్నాడు. సాయికుమార్ వారసుడు ఆది కూడా కెరీర్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా చతికిలపడే ఉన్నాడు. తనీష్- వరుణ్ సందేశ్ ఇటీవల కెరీర్ ని రీబూట్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

 

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన శ్రీతేజ్ కూడా వీళ్ళ మాదిరిగానే ఒక్క చోటే వుండిపోయాడు. వీళ్లంతా టాప్ గేర్ వేసేదెప్పుడు టాప్ రేంజ్ లోకి వచ్చేదెప్పుడన్నది మాత్రం మిలియన్ డాలర్ క్వశన్ గా ఉంది. ఇలా హీరోలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న పలువురు హీరోలు ఉన్నారు. పలువురు నవతరం హీరోలు స్టార్లు గా ఎదిగేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే వీళ్ళంతా సక్సస్ కాకపోవడానికి ముఖ్య కారణం బ్యాగ్రౌండ్ అని అర్థమవుతోంది. మెగాస్టార్, రవితేజ కి సాధ్యమైంది గాని ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలకి అలా సాధ్యపడటం లేదు. మరి కొత్తగా వచ్చేవాళ్ళని తొక్కేస్తున్నారా..లేక వాళ్ళలోనే స్టఫ్ లేదా అంటే సమాధానాలు మాత్రం అనేకం. 

మరింత సమాచారం తెలుసుకోండి: