టాలీవుడ్ క్రేజీ ఫెలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ మధ్యలో విజయ్ 'డియర్ కామ్రేడ్' పై దృష్టి పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ బాగా డిలే అయింది. అయితే త్వరలోనే విజయ్ ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడని తాజా సమాచారం. ఇక డియర్ కామ్రెడ్ విజయ్ ని బాగా డిసప్పాయింట్ చేయడంతో తన నెక్స్ట్ సినిమాల మీద ఎంతో కసి గా పనిచేస్తున్నాడట.  

 

'వరల్డ్ ఫేమస్ లవర్' ఒక షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందట. త్వరలోనే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొడతారట. ఇక ఈ సినిమా కు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయని లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ ఒక లవర్ బాయ్.. కాసనోవా తరహా పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు వాలెంటైన్స్ డే రోజున విడుదల చేస్తే క్రేజ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తాజా సమాచారం.

 

ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు గోపి సుందర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా ను కె.వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ సినిమాకి సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ 'ఓనమాలు'.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చక్కటి సినిమాలను తెరకెక్కించినప్పటికీ 'ఉంగరాల రాంబాబు' తో ఫ్లాప్ అందుకున్నాడు. మరి ఈ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో విజయ్ దేవరకొండ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడోనని విజయ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: