టాలెంట్ ఉండాలే కాని ఎప్పుడైనా ఎక్కడైనా ఛాన్సులు వస్తాయి. తెలుగులో అయితే మంచి అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాలి అప్పటివరకు ఓపిక పడితే చాలు ఆశించిన విధంగా అవకాశం వచ్చినట్టే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక హీరో గురించి సోషల్ మీడియాలో వైరల్ గా వెతుకుతున్నారు. అతనే వంగవీటి, జార్జ్ రెడ్డి సినిమాలు చేసిన హీరో సందీప్ మాధవ్. 

 

వర్మ తెచ్చాడంటేనే అతనిలో ఎంత టాలెంట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. వంగవీటి సినిమాలో సందీప్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ తర్వాత రెగ్యులర్ సినిమాల్లో ఛాన్స్ రాలేదు. మళ్లీ వంగవీటి లాంటి నిజ జీవిత కథతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ మాధవ్. 

 

జార్జ్ రెడ్డిలో అతని నటన చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న ఈ హీరో కేవలం ఇలాంటి సినిమాలకే అంకితం అవుతున్నాడు ఎందుకు అని ఆడియెన్స్ కు డౌట్ రాక మానదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. దర్శకుడు తనకు ఇచ్చిన పాత్రను చేస్తూ వస్తున్నాడు. అలాంటి తనకు రెగ్యులర్ సినిమా ఛాన్స్ వస్తే మాత్రం రఫ్ఫాడించడం గ్యారెంటీ. వంగవీటి సినిమాలో నిజంగా రంగ ఇలానే ఉంటాడేమో అనిపించేలా.. జార్జ్ రెడ్డిలో కూడా నిజంగా జార్జ్ రెడ్డి ఇంతనేనా అనిపించేలా అతని నటన ఉంది.

 

ఎలాంటి సినిమా చేసినా దర్శకుడు తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడమే నటుడి యొక్క పని. వంగవీటి, జార్జ్ రెడ్డి సినిమాలతో సందీప్ మాధవ్ తానో స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడు. ఇక జార్జ్ రెడ్డి తర్వాత మళ్లీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో వర్మ చేస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ హీరో కేవలం ఇలాంటి సినిమాలకే అంకితమా లేక రెగ్యులర్ ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తాడా అని ఆడియెన్స్ అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: