తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రాష్ట్రంలో మొక్కలు సంఖ్యను పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ చాలెంజ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ మొదలుపెట్టిన గ్రీన్ చాలెంజ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. గ్రీన్ చాలెంజ్ భాగంగా సినీ ప్రముఖులు  అందరూ మొక్కలు నాటుతూ  మరో ముగ్గురు సహనటుల కు  మొక్కలు నాటాలంటూ  సవాల్ విసురుతున్నారు. ఇక  వారూ  కూడా ఇంకొక  మూడు మొక్కలు నాటాలని సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో  ఎంతోమంది ఈ గ్రీన్  ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి  పచ్చదనాన్ని పెంపొందించారు . అంతేకాకుండా మొక్కలు నాటి అనంతరం తమ సహచరనటులను కూడా మొక్కలు నాటేందుకు సవాల్ విసిరారు. ఇప్పటికే అక్కినేని అఖిల్ వరుణ్ తేజ్,  సాయిపల్లవి, పీవీ సింధు,  యాంకర్ సుమబిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్,  బిత్తిరిసత్తి,  సూపర్ స్టార్ కృష్ణ, సామ్రాట్ తమ వంతుగా మొక్కలు నాటి తమ ఇంకొంత మందికి  మొక్కలు నాటాలని అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. 

 

 

 

 ఈ క్రమంలోనే మొక్కలు నాటిన నటుడు సామ్రాట్ తన సహచర  నటుడు అయిన బిగ్ బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ కు మరో మూడు మొక్కలు నాటాలని గ్రీన్ చాలెంజ్ చేసాడు. వరుణ్ సందేశ్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి గ్రీన్  ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. వరుణ్ సందేశ్ నాటిన మొక్కల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుని అభిమానులకు కూడా మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రంలో  పచ్చదనం పెంచే కార్యక్రమం వల్ల ఎంతో మేలు జరుగుతుంది వరుణ్ సందేశ్ అన్నారు. ఇక రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు సంతోష్ కుమార్, తనకు గ్రీన్  ఛాలెంజ్ విసిరిన సామ్రాట్ కు అభినందనలు తెలిపారు వరుణ్  సందేష్

 

 

 

 అంతేకాకుండా వరుణ్ సందేశ్ మరో ముగ్గురికి మొక్కలు నాటాలి అంటూ గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు . వరుణ్ సందేశ్ గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చిన వారిలో అరుణ్ అదిత్, ఆదర్శ్  బాలకృష్ణఅల్లరి నరేష్ లు ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఇతర సహచర నటులు  ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి  మొక్కలు నాటిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో అందరూ మొక్కలు నాటాలని ఉద్దేశంతో మొక్కలు నాటే వారిని ప్రోత్సహించేందుకు గ్రీన్ ఛాలెంజ్  ప్రారంభించారు టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్. అంతేకాకుండా సెప్టెంబర్ 5న వనమిత్ర అవార్డును కూడా ఆవిష్కరించారు ఆయన. గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్న వారందరికీ వనమిత్ర అవార్డు ప్రదానం చేయనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: