తెలుగు చిత్ర పరిశ్రమలో  యంగ్ హీరో శర్వానంద్ విభిన్నమైన శైలి. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న భిన్నమైన సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు శర్వానంద్. అందుకే ప్రేక్షకుల్లో శర్వానంద్ సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందన్న నమ్మకం ఉంటుంది . అటు సమంత కూడా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలో మెరిసిన ఈ అమ్మడు... ఇప్పుడు మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటుంది. ఇక అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత క్రేజ్ ఎక్కడికో  వెళ్ళిపోయింది.. అన్ని విషయాల్లోనూ సమంత ఇతర హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. అయితే సమంత, శర్వానంద్  కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జాను. 

 


 తమిళంలో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన 96 మూవీ ఎంత మంచి విజయాన్ని సంపాదించడం తెలిసిన విషయమే. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది  ఈ సినిమా. అయితే ప్రస్తుతం సమంత శర్వానంద్ జంటగా  దిల్ రాజు నిర్మాణంలో తమిళ హిట్ మూవీ 96 ను  తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు. కాగా తమిళ ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ జాను సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రబృందం  సినిమా ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఎంతో ఆదరణ లభించింది. 

 

 అయితే తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 96 తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా 2020 ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ సినిమా విడుదల పై మాత్రం  అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా జాను  సినిమాలో సమంత చేసిన పాత్రకు సంబంధించి సమంత గత కొన్ని రోజుల క్రితం ఆసక్తికర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాత్ర తనకు ఎంతో చాలెంజింగ్ గా అనిపించింది అని... ఈ పాత్రను మరువలేనిది  అంటూ సమంత ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మంచి వసూళ్లను  కూడా రాబట్టింది. హృదయాలను తాకే సన్నివేశాలు సెంటిమెంట్ సీన్లతో ఈ సినిమా అందరిని తెగ ఆకట్టుకుంది . దానికి తగ్గట్లుగానే సంగీత నేపథ్యం కూడా కుదరడంతో ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది . తెలుగులో ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు ప్రేక్షకులని ఎంతలా  అలరిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: