టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి అఫీషియల్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అత్యధిక వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించిన ఈ సినిమా ఖాతాలో మరొక తిరుగులేని రికార్డు వచ్చి చేరింది. ప్రపంచంలో విడుదలయ్యే సినిమాల విశ్లేషణ మరియు రేటింగ్స్ పరంగా ఎంతో అత్యున్నతంగా భావించే 'ఐఎండిబి' వారి రేటింగ్స్ లో భాగంగా ఈ ఏడాది భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో పలు బాలీవుడ్ సినిమాలను సైతం తలదన్ని సరిలేరు నీకెవ్వరు మొదటి స్థానాన్ని కైవశం చేసుకుంది. 

 

అది కూడా 41.5 % ఓటింగ్స్ తో సరిలేరు సినిమా ప్రధమ స్థానంలో నిలవగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'దబాంగ్ 3' సినిమా 12.4% ఓట్లతో రెండు, మరియు సంజయ్ దత్, అర్జున్ కపూర్ వంటి మరికొందరు నటులు నటిస్తున్న హిస్టారికల్ మూవీ 'పానీపట్' సినిమా 8.8% ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాయి. ఈ విధంగా ఒక రీజినల్ సినిమా, బాలీవుడ్ సినిమాలను సైతం తలదన్ని అత్యధిక ప్రేక్షక ఓటింగ్స్ తో మొదటి స్థానంలో నిలవడం నిజంగా మనకు గర్వ కారణం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

 

ఇక గతంలో కూడా సూపర్ స్టార్ మహేష్ నటించిన పలు సినిమాలు ఐఎండిబి లో మంచి రేటింగ్స్ సాధించడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అతి త్వరలో మొదటి సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: