ఈ మద్య మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.  అన్యాయంగా ఆడవారి జీవితాలతో కొంత మంది మృగాళ్లు అడుకుంటున్నారు.  చిన్న పెద్దా అనే వయసు తేడా లేకుండా అత్యాచారాలు, లైంగిక దాడులు చివరకు హత్యలకు కూడా తెగబడుతున్నారు.  ఓ వైపు ప్రభుత్వం ఎంత కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..మద్యానికి, డ్రగ్స్, ఫోర్న్ మూవీస్ కి బాని అయిన వారు ఇలాంటి వాటికి ఎక్కువగా తెగబడుతున్నారు.  ఒకదశలో మహిళలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే గుండెల్లో వణుకు పుట్టేలా చేస్తున్నారు.  

 

తాము ఉన్నది సమాజాంలోనే లేక కృరమైన అడవిలోనా అన్న భయంతో జీవితాన్ని గడుపుతున్నారు.  అయితే లైంగిక సమస్యలు..దాడులు సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. ఇటీవల కాలంలో ఈ సమస్యపై మీ టూ ఉద్యమం ద్వారా ఎంతో మంది నటీమణులు గతంలో తమపై జరిగిన అకృత్యాల గురించి ఎలుగెత్తి చెబుతున్నారు.  తెలుగులో కెరటం సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన బాలీవుడ్ మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి ఫామ్ లోకి వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరో సరసన నటిస్తూ పాపరలర్ హీరోయిన్ గా మారిపోయింది.  

 

టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.  బాలీవుడ్ భామే అయినా హైదరాబాద్ కి మకాం మార్చి ఇక్కడే తన వ్యాపారాలు కూడా కొనసాగిస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వైజాగ్ లో నిర్వహించిన 555కే 2.0 వాక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కయ్యపాలెం పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రకుల్ మాట్లాడుతూ..పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఇప్పుడు ఆడవాళ్లు మగవారితో అన్నింటిలో సమానంగా ఉన్నారు..ముఖ్యంగా మనోధైర్యంతో తమపై ఎవరైనా ఎటాక్ చేస్తే ఎదుర్కొవాలని..వారికి సరైన బుద్ది చెప్పాలని అన్నారు. 

 

చెడు స్పర్శకు, మంచి స్పర్శకు మధ్య తేడా ఏమిటో చిన్నారి బాలికల్లో అవగాహన కలిగించాలని, ఇది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. సమాజంలో అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకేవాళ్లు ఎక్కువ అవుతున్నారని, ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లేనని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన శాస్తి చేయాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: