‘అర్జున్ రెడ్డి’ సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో స్టేటస్ సంపాదించి సౌత్ ఇండస్ట్రీ లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరో అయిపోయాడు. ఇదిలా ఉండగా చేస్తున్న సినిమాలు ‘గీత గోవిందం’ తర్వాత వరుసగా ఫ్లాపులు కావటం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల మధ్య విడుదలైన బోల్తాపడటంతో ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన చివరి సినిమా డియర్ కామ్రేడ్ దారుణంగా ఫ్లాప్ కావడం అదే విధంగా నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమా కూడా ఫ్లాప్ అవడంతో తాజాగా విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్' సినిమా విషయం లో సినిమా రిలీజ్ విషయంలో విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అన్ని రకాలుగా సినిమాకి లాభాలు వచ్చేటట్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని సినిమా యూనిట్ కి తెలియజేయడంతో తాజాగా సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలి భావించిన  సినిమా టీం...నిర్ణయం మార్చుకుని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీఖున సినిమా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

 

సినిమా కి పోటీ కాకుండా సినిమాకి లాభాలు వచ్చేటట్లు విజయ్ దేవరకొండ చెప్పడం టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ నటించిన భీష్మ సినిమా విడుదలైన వారం తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ విజయ్ పోస్టర్ సోషల్ మీడియా అర్జున్ రెడ్డి తరహాలో అభిమానులను అట్రాక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

 

అయితే ఈ సినిమాతో ఎలాగైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన రాశీ ఖన్నా, కేథరిన్‌ థెరీసా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: