త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే మరియు నివేత పేతురాజ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురం లో' ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే 3 పాటలు విడుదల చేసిన చిత్ర బృందం తమన్ ఆధ్వర్యంలో చితక్కొట్టేసింది అనే చెప్పాలి. ఒక ఫ్లాప్ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు గీత ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడవది.

 

అయితే 'అల వైకుంఠ పురం లో' సినిమాకు గాను అల్లు అర్జున్ 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు ఈ చిత్ర బడ్జెట్ 120 కోట్లు కాగా దానిలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ రేమ్యునరేషన్ కూడా కలిగి ఉంది. విచిత్రమేమిటంటే అల్లు అర్జున్ 25 కోట్లు తీసుకుంటుండగా మరోవైపు అతని తండ్రి అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ హారిక హాసిని క్రియేషన్స్ లాభాల్లో వాటా కూడా రాబట్టనుంది. 

 

ఇకపోతే 'అల వైకుంఠపురం లో' అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తున్న చిత్రం. గీతా ఆర్ట్స్ లాభాల్లో వాటా తో పాటు తనకు పాతిక కోట్ల రూపాయలు కావాలని అల్లుఅర్జున్ డిమాండ్ చేసినట్లు అంతా చెబుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం కి గాను 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. మొత్తానికి వసూలు తిరిగి రాబట్టగలిగే యాక్టర్ అయిన అల్లు అర్జున్ మరియు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కలిసిన ఈ చిత్రానికి అంత మొత్తం పెట్టడం ఆశ్చర్యంగా లేకపోయినా సంక్రాంతి లో ఉన్న పోటీని తట్టుకొని ఈ చిత్రం నిలుస్తుందా అన్నది ఒక్కటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మహేష్ సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' కనుక క్లిక్ అయితే మాత్రం బన్నీకి బాక్సాఫీస్ కాష్టాలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: