క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ ఈమద్య కాలంలో తన సినిమాల సంఖ్యను చాలా తగ్గించాడు. 2014లో చరణ్ తో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం చేసిన తర్వాత 2017లో నక్షత్రం అనే చిత్రాన్ని చేశాడు. ఈ అయిదు సంవత్సరాల్లో కృష్ణవంశీ నుండి వచ్చినవి రెండే సినిమాలు. 

 

ఈయన సినిమాల గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు కృష్ణవంశీ 'రంగ మార్తాండ' అనే చిత్రాన్ని మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు చేస్తున్నట్లు ఒక నెల క్రితం ప్రకటించేశాడు.. అయితే తాజాగా ఈ చిత్రానికి ఎలాంటి హడావుడి లేకుండా విశాఖపట్నంలో షూటింగ్ ప్రారంభించాడు కృష్ణ వంశి. 

 

ఈ విషయాన్నీ ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కొత్త సినిమా ప్రారంభానికి అతని చిరకాలస్నేహితుడు, దర్శకుడు తేజ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. కాగా ఈ సన్నివేశానికి ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. కాగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

కాగా కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఇళయరాజాతో కృష్ణవంశీ కలిసి పనిచేయడం ఇది రెండోసారి. 'అంత:పురం' సినిమాకు ఈ పెయిర్ కలిసి చేశారు. అప్పట్లో ఈ సినిమాలో వచ్చిన అసలేం గుర్తుకు రాదు సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మరి ఈ రంగమార్తాండ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. 

 

కాగా కృష్ణ వంశి దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.. అతని దర్శకత్వంతో ఎందరో ప్రేక్షకుల మనసుని దోచుకున్నాడు. తొలి చిత్రం 'గులాబి' నుంచి ఆయన చేసిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. 'నిన్నే పెళ్లాడుతా', 'సింధూరం', 'అంత:పురం', 'ఖడ్గం', 'రాఖీ' వంటి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళి సినిమా తీస్తున్నాడు కృష్ణవంశీ. మరి ఈ సినిమా ఎంత హిట్ సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: