టాలీవుడ్ దిగ్గజ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టిస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

 

ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది సినిమా యూనిట్. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో తొలిసారిగా తన ఎంటైర్ కెరీర్ లో, దర్శకుడు రాజమౌళి ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ని ఎంతో ఆకట్టుకునేలా తెరకెక్కించబోతున్నారట. ఇప్పటివరకు వచ్చిన రాజమౌళి అన్ని సినిమాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ, ఈ సినిమాలో మాత్రం ఒకింత ఎక్కువగా ఉంటాయని, రామ్ చరణ్

 

మరియు ఎన్టీఆర్ జంటల మధ్య రాబోయే ఈ సీన్స్ యువతను మరియు సాధారణ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని టాక్ వినపడుతోంది, అంతేకాక ఇప్పటివరకు రాజమౌళి సినిమాల్లో పెద్దగా రొమాన్స్ ఉండదు అనే వారికి ఈ సీన్స్ తో సరైన సమాధానం లభిస్తుందని అంటున్నారు. సముద్ర ఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడం సహా మొత్తం పది భాషల్లో ఏకకాలంలో అత్యంత భారీగా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగనుంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: