టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ప్రేక్షకులందరికీ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. తన డాన్సులతో డైలాగులతో కాస్ట్యూమ్స్  తో టాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా వార్తల్లో  నిలుస్తున్నాడు. అలా  వైకుంఠపురములో  సినిమా గురించి అనుకుంటున్నరా... అది కూడా ఒక కారణమే అనుకోండి. ప్రస్తుతం అల్లు అర్జున్ తన జోరు చూపిస్తున్నాడు. అల వైకుంఠపురం సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే అల్లు అర్జున్ గత కొంత కాలంగా తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాల్లో  కూడా చూసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మధ్య ఆస్తి పంపకాలు తర్వాత బన్నీ అటు పర్సనల్ విషయాలు ఇది సినిమాల విషయంలో జోరు  చూపిస్తున్నాడు. 

 

 

 

 ముఖ్యంగా ఈ మధ్య బన్నీ కొత్త ఇంటి కోసం ముహూర్తం  పెట్టిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు కోట్ల రూపాయలు పెట్టి కార్వాన్  తీసుకొచ్చాడు. అప్పట్లో అల్లు అర్జున్ కార్వాన్  వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల వరకు అల్లు అర్జున్ కార్బన్ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన కొత్త ఆఫీస్ నిర్మించబోతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బంజారాహిల్స్ లో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి బన్నీ తన ఆఫీసు నిర్మించబోతున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎలాంటి ఆఫీస్ నిర్మించబోతున్నారు అనేదానిపై హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే బన్నీ నిర్మించబోయే తన కొత్త ఆఫీసు ముందు కార్పొరేట్ ఆఫీస్ లో కూడా జుజుబీ  అంటూ ప్రచారం జరుగుతుంది. 

 

 

 

 అయితే ఈ కొత్త ఆఫీస్ కి సంబంధించి ప్రతి విషయంలో బాగా బాగానే ఖర్చు పెడుతున్నారట అల్లుఅర్జున్.  అన్ని విషయాల్లో చాల కాస్లీగానే  ఆలోచిస్తున్నారట అల్లు అర్జున్. ఈ కొత్త ఆఫీస్ లో ఫ్యాన్స్ విజిటర్స్ కూర్చోవడానికి వాళ్లతో సంభాషణలు జరపడానికి కూడా వీలుగా భారీ  కార్యాలయమే ఉంటుందని తెలుస్తోంది. అయితే గీత ఆర్ట్స్ కు  సంబంధించిన ఫోటోలతో పాటు కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా ఈ ఆఫీసులో ఫుల్లుగా నిండిపోతాయి అని అర్థమవుతుంది. దీనికితోడు ఎండోర్స్ మెంట్  కోసం కూడా కొత్త ఆఫీసు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ఆఫీస్ లో  అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడడానికి కూడా సపరేట్ గా  ఓ గదిని ఏర్పాటు చేస్తున్నారుట . ఇక బన్నీ ఆఫీసుకు వచ్చిన వాళ్లకు పార్కింగ్ లో కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏరియా కూడా భారీగానే ఉండబోతున్నట్లు  సమాచారం. ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కొత్త ఆఫీస్ గురించి హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: