‘బాహుబలి’ పుణ్యమా అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు అవకాశం కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి తో ప్రభాస్ మార్కెట్ అంతర్జాతీయంగా ఏర్పడటంతో ఆ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా డైరెక్టర్ మరియు నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్ సినిమాకి ఒప్పుకుంటే తెల్లవారి సరికల్లా కథ ఓకే చేపించి ఆ తర్వాత రోజు నుండే సినిమా స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా  ప్రభాస్ తో సినిమా చేయడానికి వెంకట పడుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

 

ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విడుదల కావడం వెనుక కరణ్ జోహార్ పాత్ర మరువలేనిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో ప్రభాస్ కూడా తన బాహుబలి సినిమా ప్రమోషన్ విషయంలో కరణ్ జోహార్ చూపించిన ఇంట్రెస్ట్ కి...కరణ్ జోహార్ తో కూడా సినిమా చేయాలి అని అని సౌత్ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా యూనివర్సల్ పాయింట్ కలిగి ఉన్న స్టోరీ చేయాలని మొదటి నుండి ప్రభాస్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట.

 

ఇటువంటి నేపథ్యంలో అటువంటి స్టోరీ కలిగి ఉన్న కథను సెట్ చేయడంలో కరణ్ జోహార్ చాలా కథలు వింటుందా కానీ అవి సెట్ కావడం లేదట. ఇటువంటి నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఒక స్ట్రాంగ్ లైన్ చెప్పిన కథ కరణ్ జోహార్ కి నచ్చడంతో కొద్ది మార్పులు తీసుకురావాలి అని భావించడంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ని కమర్షియల్ ఫార్మాట్ లో డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో స్క్రిప్టు అంతా ఓకే అయితే రాబోయే రోజుల్లో ప్రభాస్ తో కరణ్ జోహార్ సినిమా చేయడం అంత సిద్ధమైనట్లే అన్న వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: