ఓ బేబీ చిత్రంతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది సమంత. ద‌క్షిణాదిలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించింది.  ఈ మ‌ధ్య కాలంలో ఆమె ఎంచుకునే క‌థ‌ల్లో ఎక్కువ‌గా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌కి ప్రాధాన్య‌త‌నిస్తుంది. యూట‌ర్న్‌, ఓబేబి లాంటి చిత్రాల్లో మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి హిట్లు కొట్టింది. ఓ ప‌క్క సినిమాల్లో న‌టిస్తూనే వెబ్ సిరీస్‌లో న‌టించ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతుంది స‌మంత‌. ఇక ఇదిలా ఉంటే క‌థ‌ల ప‌ట్ల మంచి అవ‌గాహ‌న ఉన్న స‌మంత రానున్న రోజుల్లో సినిమాల‌ను నిర్మిస్తుంద‌నే స‌మాచారం. అందుకోసం ఆమె నిర్మాణం విష‌యంలో అన్నీ తెలుసుకుంటుంద‌ట‌. అయితే అప్ప‌ట్లో విడుద‌లైన చి.ల‌.సౌ చిత్రం త‌న‌కు న‌చ్చ‌డంతో ఆ చిత్ర నిర్మాణంలో  అన్న‌పూర్ణ స్టూడియోస్ ద్వారా విడుద‌ల చేశారు స‌మంత‌. క‌థ‌లు మంచివి దొరికితే పెద్ద ఎత్తులో నిర్మాణం మొద‌లుపెట్టాల‌ని ఆమె అనుకుంటున్నార‌ట‌. లేడీ ఓరియంటెడ్ క‌థ‌ల పై ఫోక‌స్ పెట్టిన స‌మంత క‌థ బావుంటే తాను న‌టిస్తూ నిర్మిద్దామ‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ విష‌యం పై ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. 

 

ప్రస్తుతం ఆమె తమిళ్ రీమేక్ 96 లో నటిస్తోంది.ఇక మళ్ళీ ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్షన్ లొనే మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సురేష్ బాబు ప్రొడక్షన్ లో కూడా సమంత మరో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే. బేబీకి ఇటీవల ఒక హారర్ కథ ఎదురైనట్లు సమాచారం. ఒక యువ దర్శకుడు చెప్పిన భయానక దెయ్యం కథ అమ్మడికి తెగ నచ్చేసిం దట. అయితే ఆ సినిమాను సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించాలని బేబీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

 

భర్త నాగ చైతన్యతో కలిసి ఒక బ్యానర్ ను స్టార్ట్ చేయనున్నట్లు గతంలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే మొదటి సినిమా స్ట్రాంగ్ గా ఉండాలని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా హారర్ కథను ఎంచుకుందట.ఇంకా ఈ విషయంపై ఫైనల్ ఎనౌన్స్మెంట్ రావాల్సిఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: