చాలా రోజులుగా ఇండస్ట్రీలో బయోపిక్ ల సందడి ఎక్కువైంది. గత సంవత్సరం  నుండి ఇది మరింత పెరిగింది. మహానటి సినిమా విజయవంతం కావడంతో ప్రతీ ఒక్కరూ బయోపిక్ లు తీసేస్తున్నారు. అయితే అందరూ మహానటిని మించి తీద్దామని అనుకున్నవాళ్లే. కానీ ఏ ఒక్కరు కూడా మహానటి దరిదాపులకి కూడా రాలేకపోయారు. విశ్వ విఖ్యాత ఎన్టీఆర్ బయోపిక్ సైతం ప్రేక్షకులని ఆకర్షించలేకపోయింది.

 

ఇటీవల విడుదల అయిన జార్జి రెడ్డికి ప్రేక్షక ఆదరణ ఫరవాలేదనిపించింది. చిన్న సినిమాగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఆ సినిమాలో కూడా లోపాలున్నాయని చాలా మంది అభిప్రాయం. ఆ విషయం అటుంచితే, ప్రస్తుతం మరో బయోపిక్ కోసం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ జీవితం ఆధారంగా బయోపిక్ ఉంటుందనే వార్త గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

గతంలో దర్శకుడు తేజ ఈ సినిమాన్ని చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తేజ ఈ వార్తలని ఖండించాడు. ఖండించడమే కాదు ఆ బయోపిక్ తీయడం కష్టమని వర్కవుట్ అవదని లాజికల్ గా చెప్పాడు కూడా. అయినా కూడా ఈ బయోపిక్ గురించిన వార్తలు ఆగడం లేదు. సందీప్ కిషన్‌ను ఉదయ్ పాత్రకు ఎంచుకున్నారని.. వెబ్ సిరీస్ తీసిన ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు.

 

అయితే ఉదయ్ కిరణ్ బయోపిక్ లో కొత్తగా జనాలకి చెప్పేది ఏమీ లేదని, ఆయన జీవితం గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసునని, అందువల్ల ఉదయ్ కిరణ్ బయోపిక్ సినిమాగా సక్సెస్ అవకపోవచ్చని అంటున్నారు. అందుకని బయోపిక్ ప్రసక్తి పక్కన పెట్టేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ బయోపిక్ విషయంలో పుకార్లు ఆగిపోతాయా లేదా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: