తన తోటి నటీనటుల ప్రేమ వ్యవహారాల గురించి సరదాగా అయినప్పటికి కాస్త ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఆ విషయంలో తనను కూడా కలుపుకునే దీపిక ఈ హాట్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ నటీ నటులకు చాలా ప్రేమ వ్యవహారాలు ఉంటాయన్న విషయాన్ని దీపిక వెల్లడించింది. తామంతా 'విత్ ఔట్ ది షేమ్' అని దీపిక మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.

 

ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో దీపిక భర్త రణ్ వీర్ సింగ్ కూడా అక్కడే ఉండటం ఇక్కడ అసలు ట్విస్ట్. ఆ ప్రోగ్రామ్ లో దీపిక, రణ్ వీర్, విజయ్ దేవరకొండ, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ భాజ్ పాయ్ లు ఉన్నారు. ఒక అంశం మీద దీపిక స్పందిస్తూ.. తామంతా నిస్సిగ్గుగా పలు ప్రేమాయణాలను నడిపినట్టుగా వ్యాఖ్యానించింది.ఆ విషయంలో తనను తాను ఎగ్జాంపుల్ గా చెప్పుకుంది.

 

'నేను రణ్ బీర్ కపూర్ తో ప్రేమను సాగించాను. కొన్నాళ్ళు డేట్ కూడా చేశాము. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు రణ్ బీర్ కపూర్- అలియాలు పెళ్లి చేసుకుంటున్నారు..' అంటూ దీపిక ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా ఓపెన్ గా మాట్లాడింది. తన మాజీ ప్రియుడి గురించి తన భర్త పక్కనే ఉండగా ప్రస్తావన తెచ్చింది దీపిక. ఇక్కడ ఇంకో ట్విస్టేమిటంటే అలియా భట్ కూడా అక్కడే ఉండటం. తను ఈ అంశం మీద స్పందించింది.

 

అది కూడా దీపిక వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తూ..'రణ్ బీర్ –అలియాలు పెళ్లి చేసుకుంటున్నారు..' అంటూ  దీపిక వ్యాఖ్యానించగా, 'అది నువ్వెలా డిక్లేర్డ్ చేస్తావ్..' అంటూ ప్రశ్నించేసింది అలియా. తను రణ్ బీర్ ను పెళ్లి చేసుకోవడాన్ని ధ్రువీకరించలేదు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా మాట్లాడిన దీపిక మాటలను అలియా ఖండించింది! మొత్తానికి వ్యవహారాల గురించి సినిమా వాళ్లే ఓపెన్ గా చెప్పుకుంటుంటే ఇది చూసిన బయట జనాలు చేసేది సిగ్గుమాలిన పని మళ్ళీ దాన్ని సిగ్గు లేకుండా చెప్పుకోవడం అంటూ చిరాకు పడుతున్నారు. ఎవరెన్ని అన్నా సినిమా వాళ్ళకి ఇవన్నీ గోటితో సమానం. ప్రేమొకరితో.. పెళ్ళొకరితో అన్న కాన్సెప్ట్ వీళ్ళకి చాలా కామన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: