మన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తీసుకునే నిర్ణయాలు వాళ్ళ స్థితి గతులనే మార్చేస్తాయి. అసలు ఇలాంటి హార్ష్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. డబ్బు సంపాదన కోసమా..లేక క్యారెక్టర్ కోసమా..లేక క్రేజ్ కోసమా..అని ఆలోచిస్తే ఏమాత్రం అర్థం కాదు సరికదా..మిలియన్ డాలర్స్ క్వశన్ గా మిగిలిపోతుంది. ప్రస్తుతం మన సునిల్ పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నది పోయో..ఉంచుకున్నది పోయో అన్న సామెత మాదిరిగా కమెడియన్ గా ఉన్న క్రేజ్ పోయి, హీరోగా ఛాన్సులు పోయీ అయోమయంలో ఉన్నాడు. ఒక స్టార్ కమెడియన్ హీరో గా కొన్నేళ్ళు మాత్రమే కొనసాగగలరు. రాజేంద్ర ప్రసాద్ నరేష్ వంటి కామెడీ హీరోలు కొన్ని ఏళ్ళు మాత్రమే హీరోగా సినిమాలు చేసారు. ఇక అలి, వేణు మాధవ్ కూడా అంతే. సునీల్ కూడా అదే చేసాడు. 

 

కమెడియన్ గా పీక్ టైంలో ఉండగానే హీరోగా చేసే సినిమాల మీద దృష్టి పెట్టి  మోచేతులు వరకు కాల్చుకున్నాడు. ముఖ్యంగా కామెడీ ప్రాదాన్యత కథలు కాకుండా యాక్షన్ కమర్షియల్ సినిమాల వైపు ఆసక్తి చూపించి దారుణంగా నష్ట పోయాడు. అయితే మళ్ళీ కమెడియన్ గా సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' లో నీలాంబరి అనే పాత్రలో నటించాడు. ఆ సినిమా తనకు కమెడియన్ గా మళ్ళీ అవకాశాలు అందిస్తుందని ఊహిస్తే అలాంటివేం జరగలేదు. పాత్రలో కామెడీ లేక పోవడంతో ఆ పాత్ర క్లిక్ అవ్వలేదు. అందుకే మళ్ళీ 'అల వైకుంఠపురములో' లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో సునిల్ ని తారక్-త్రివిక్రమ్ ఇద్దరు ఆదుకోలేకపోయారు.

 

ఈసారి తన స్నేహితుడు త్రివిక్రమ్ సునీల్ కామెడీ పైన ఫోకస్ పెట్టి మంచి కామెడీ రోల్ చేయిస్తున్నాడట. సినిమాలో బన్నీ -సునీల్ మధ్య కామెడీ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఒక వేల ఇది నిజమైతే పరవాలేదు. లేదంటే మళ్ళీ కమెడియన్ రోల్స్ కి కూడా సునీల్ గుడ్ బై చెప్పాల్సి వస్తుందేమోనని చెప్పుకుంటున్నారు. కనీసం సునిల్ ని బన్నీ అయినా ఆదుకుంటాడా..అని సానుభూతి చూపిస్తున్నారు. మరి సునిల్ పరిస్థితి ఏంటో 'అల వైకుంఠపురములో' డిసైడ్ చేయబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: