అవును మీరు విన్నది నిజమే.  రష్మిక మందన .. హాట్ బ్యూటీ ... ఆమె కోసమే ఒళ్లంతా కళ్ళు చేసుకోవాల్సిందేనట.   ఎందుకంటే ఆమె వెరీ వెరీ స్పెషల్ కాబట్టి.  చలో అంటూ టాలీవుడ్ కి వచ్చేసిన అందాల భామ. గీతా గోవిందం కబుర్లు చెప్పిన ముద్దు గుమ్మ. డియర్ బ్రదర్ లో లిప్ లాక్ తో యూత్ హార్టులను లాక్ చేసి పారేసిన చిన్నది.  సో రష్మిక స్పెషలే మరి.

 

అంటున్నారు సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తే అందులో ఎక్కడా  రష్మిక లేదు. నిజమే ఎవరు గమనించారో ఏమో కానీ  రష్మిక ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు.  తమ అభిమాన  హీరోయిన్ లేదని వారు అంటున్నారుట. ఇదిలా  ఉండగా ఈ మూవీ టీజర్ లో తనని లేకుండా చేస్తారా అంటూ రష్మిక కూడా అలిగిందట.

 

దానికి చిత్ర యూనిట్ చెప్పిన సమాధానం ఏంటంటే స్పెషల్ గా మరో టీజర్ రిలీజ్ చేస్తారట. అందులో రష్మిక సీన్లే కట్ చేసి మరీ సెట్ చేస్తారట. ఇదంతా ప్రమోషన్లో భాగమని, అందువల్లే రష్మికను అలా దాచేశారని అంటున్నారు.

 

దీంతో రష్మిక స్పెషల్ టీజర్ ఎపుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారుట. ఈ మూవీలొ హైప్ తెచ్చే  విషయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా స్ట్రాటజీగా అన్నీ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్  విజయశాంతి లుక్ రిలీజ్ చేయడంలోనూ అదే విధంగా ఆయన చేశారు.

ఇక మహేష్ బాబు విషయంలో అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఒకే ఒక్క  టీజర్ తో దుమ్ముదులిపేశాడు. ఇక రష్మిక అందాల అభినయంతో మరో టీజర్ కూడా రెడీ చేసే పనిలో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉందిట. అన్నట్లు ఒక విషయం తెలుసా. ఈ మూవీలో ఇంతవరకూ రష్మిక పోస్టర్ ని కానీ, ఆమె పాత్ర గురించి కానీ అనిల్ రావిపూడి ఎక్కడా రివీల్ చేయలేదు. అదే సీక్రెట్ అంటున్నారు. మరి టీజర్లో రష్మిక ఎలా కనిపించేలా డిజైన్ చేస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: