వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా' పై హైకోర్టు లో పిల్ నమోదయింది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు గడప తొక్కారు. రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జివి) దర్శకత్వం వహించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక వ్యాపారవేత్త మంగళవారం తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

 

ఈ చిత్రం యొక్క ట్రైలర్స్ ను బట్టి, ఈ చిత్రంలో కమ్మ సమాజాన్ని అవమానించడం జరిగింది. ఈ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ మరియు టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి నిజ జీవిత వ్యక్తిత్వాలను పోలిన పాత్రలు ఉన్నాయి. ఈ చిత్రం యొక్క దర్శకుడు మరియు నిర్మాత కమ్మ సమాజాన్ని కించపరచాలని కోరుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. 

 

‘పప్పు లాంటి అబ్బాయి’ పాటను ప్రస్తావిస్తూ, ఈ పాట ను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ఈ పాట చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని చిత్రీకరించారని పిటిషనర్ ఆరోపించారు. "ఈ పాట లోకేష్ మరియు చంద్రబాబులను అవమాన పరిచేలా ఉంది" అని పిటిషనర్ చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

 

ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన దగ్గర నుంచి రోజూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. రాంగోపాల్ వర్మ కు పైసా ఖర్చు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలైన ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: