అక్కినేని వారి కోడలు సమంత నటిగా తానేంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో ఆమె నటించడమే కాదు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ  తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ఇక అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకుని అటు సంసారం, ఇటు సినిమా రెండింటినీ చక్కగా  బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నారు.

 

సమంత పెళ్ళి తరువాత నటించిన రంగస్థలంలో ఆమె గ్లామర్ మరింతగా పెరిగిందని కూడా అంతా అంటున్నది నిజం. ఇదిలా ఉండగా సమంత నటిగా కొనసాగుతానని అంటున్నారు. తనకు అవకాశాలు ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటానని మరో మారు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో సమంత చిత్ర నిర్మాణ రంగంపైన ద్రుష్టి పెట్టారని అంటున్నారు.

 

తనకు అంటూ సొంతంగా నిర్మాణ రంగం ఉండాలని ఆమె భావిస్తున్నారుట. దీనికి సంబంధించి తొందరలోనే ఒక ప్రోడక్షన్ హౌస్ ని ఓపెన్ చేస్తారని తెలుస్తోంది. ఇకపై మంచి కధలు దొరికితే సొంత ప్రోడక్షన్ హౌస్ నుంచే సినిమాలు తీయాలని సమంత అనుకుంటున్నారుట. అదే విధంగా తనకు సూట్ అయ్యే కధలు దొరికితే తాను కూడా సొంత బ్యానర్లో నటిస్తానని ఆమె అంటున్నరు.

 

ఇక తన భర్త చైతూని హీరోగా పెట్టి సినిమాలు తీయాలన్న ఆలోచన కూడా సమంతాకు ఉందిట. మంచి కధలు ఉంటే ఎవరూ సినిమాలు బయట తీసేందుకు రెడీ కాకపోతే రిస్క్ చేసైనా తాము నిర్మిస్తామని ఆమె అంటున్నారు. అంటే ఇపుడు చైతూకు సమంత వైఫ్ మాత్రమే కాదు, నిర్మాత కూడానన్నమాట. మరి తొందరలోనే ఆమె దర్శకురాలిగా కూడా అవతారం ఎత్తుతారేమో చూడాలి. ఏది ఏమైనా ఒక ప్లాన్ ప్రకారం అక్కినేని కొడలు సినీ రంగంలో తన హవా చాటుకుంటున్నారనే చెప్పాలి. ఇక్కడో విశేషం ఉంది. అక్కినేని వారి తొలితరం కోడలు అన్నపూర్ణమ్మ గారి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇపుడు సమంత కనుక కొత్తది ఓపెన్ చేస్తే ఆ వారసత్వాన్ని కొనసాగించిన వారు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: