నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా భారీగా తెరకెక్కు తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పాటలను
డిసెంబరులో విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలకు ఎంతో ప్రాధాన్యముండేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకల్పన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య  శాస్ర్తి రెండు పాటలు, శ్రీమణి ఒక పాట రాశారు. ఇందులో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయని దర్శకుడు సతీష్ వేగేశ్న
తెలిపారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ను ఖర్చుకు వెనుకాడ కుండా చాలా రిచ్ గా తీశామని, గోదావరి నదిలో సాహోసో పేతంగా చిత్రీకరించిన ఈ సన్నివేశాల విషయంలో ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారని వివరించారు.  

 

నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ సినిమా షూటింగ్ కారక్రమాలు పూర్తయ్యాయని, జనవరి 15న విడుదల చేయను న్నామని చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ‘‘కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీజ‌ర్‌కి అద్భుత మైన స్పందన లభిస్తోంది. ఆఖరి షెడ్యూల్‌ కేరళలోని మున్నార్‌ తదితర  సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆడియో రంగంలో మా సంస్థ ఎలా దూసుకుపోయిందో చిత్ర నిర్మాణ రంగంలోనూ ఆ ఒరవడిని కొనసాగిస్తుంది.డిసెంబరు 1 నుంచి రీరికార్డింగ్ ప్రారంభమవుతుంది ’’ అని వివరించారు. చిత్ర సమర్పకులు  శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ  ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది. చాలా సంతృప్తికరంగా అవుట్ పుట్ వచ్చింది. డిసెంబరులో పాటలను విడుదల చేస్తాం’’ అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: