సినిమా రంగం అంటేనే పుకార్లకు నిలయం. ఇక్కడ ఏ వార్త ఎప్పుడు ఎవరికి షాక్ ఇస్తుందో తెలియదు. ఎవరు ఎవరితో ఎన్నాళ్లూ కలిసింటారో అర్ధం కాదు. ఇక్కడున్నన్ని ప్రేమ వ్యవహారాలు మరెక్కడ కనిపించవు. ఇకపోతే దీపికా పదుకునే తన సాటి నటీనటుల ప్రేమ వ్యవహారాల గురించి సరదాగానే కాస్త ఆసక్తిదాయకమైన కామెంట్స్ తనను కూడా కలుపుకునే చేసింది. ఈ సందర్భంగా తమకు చాలా ప్రేమ వ్యవహారాలు ఉండటాన్ని దీపిక ప్రస్తావిస్తూ,. తామంతా 'విత్ ఔట్ ది షేమ్' అని వ్యాఖ్యానించింది..

 

 

ఇలా మాట్లాడే సమయంలో దీపిక భర్త రణ్ వీర్ సింగ్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. ఆ ప్రోగ్రామ్ లో దీపిక, రణ్ వీర్, విజయ్ దేవరకొండ, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ భాజ్ పాయ్ తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ వచ్చిన ఒక అంశం మీద దీపిక స్పందిస్తూ.. తామంతా నిస్సిగ్గుగా పలు ప్రేమాయణాలను నడిపినట్టుగా వ్యాఖ్యానించింది.ఆ విషయంలో తనను తాను ఉదహరించుకుంది.

 

 

అదేమంటే రణ్ బీర్ కపూర్ తో మొదట నేను ప్రేమవ్యవహారం సాగించాను. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నాను. అలాగే ఇప్పుడు రణ్ బీర్ కపూర్- అలియాలు పెళ్లి చేసుకుంటున్నారు..  అంటూ తన పాత ప్రియుడి గురించిన తన భర్త పక్కనే ఉండగా ప్రస్తావన తెచ్చింది దీపిక.

 

 

ఇక్కడ కామెడీ ఏమిటంటే.. అలియా భట్ కూడా  అక్కడే ఉండటమే కాదు, ఈ అంశం మీద వెంటనే స్పందించి, ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. రణ్ బీర్ – అలియాలు పెళ్లి చేసుకుంటున్నారు.. అంటూ నువ్వెలా డిక్లేర్డ్ చేస్తావ్.. అంటూ ప్రశ్నించేసింది అలియా. తను రణ్ బీర్ ను పెళ్లి చేసుకోవడాన్ని ఇంకా ధ్రువీకరించలేదు అంటూ తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా మాట్లాడిన దీపిక మాటలను ఖండించింది! మొత్తానికి తమ వ్యవహారాల గురించి సినిమా వాళ్లే  ఓపెన్ గా చెప్పుకునే రోజులు ఇప్పుడు వచ్చేసినట్టుగా ఉన్నాయంటున్నారు కొందరు సినీ ప్రియులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: