టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ  అక్కినేని కోడలు సమంత. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నది ఈ అమ్మడు . అటు హీరోలకు మంచి స్టార్ డమ్  సంపాదిస్తున్న టాలీవుడ్ భామ సమంత. అయితే ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే  అటు టాలీవుడ్ ప్రేక్షకులని  మాయ చేయడంతోపాటు... నాగచైతన్య కూడా మాయ చేసి కొన్ని రోజులు ప్రేమాయణం నడిపి  ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత ప్రస్తుతం ఇమేజ్ బాగా   పెరిగిపోయింది అంతేకాదు ఈ అమ్మడు దూకుడు కూడా బాగానే పెరిగిపోయింది. వరుస హిట్లతో దూసుకుపోతుంది ఈ అందాల భామ . పెళ్లి తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ నటనలో తనదైన ముద్ర వేసుకుంది. 

 

 

 

 ఇక పెళ్లి తర్వాత చేసిన సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్  హిట్ గా  నిలుస్తున్నాయి . ఇక అటు ఫిట్నెస్ విషయంలో కూడా అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ దూకుడు చూపిస్తుంది సమంత. ఓవైపు కుటుంబానికి మరోవైపు సినిమాలకు బాలెన్స్ చేస్తూ... టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పెళ్లికి ముందు నత్త నడకలా నడిచిన సమంత సక్సెస్ రేట్ కాస్త పెళ్లి తర్వాత టాప్ గేర్ లో దూసుకుపోతుంది.ఈ  ఏడాది సమంతకి బాగా కలిసొచ్చింది. మొదట తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమా మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత లేడీ ఓరియెండిటెడ్  మూవీ గా వచ్చిన  ఓ బేబీ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ప్రస్తుతం సమంత మామయ్య బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 మామయ్య లాగే తాను కూడా  సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసే ఆలోచనలో సమంత  ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉందనే విషయం తెలిసిందే. అక్కినేని కోడలు మాత్రం మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏర్పటు చేసి  కొత్త కొత్త ఐడియాలతో వచ్చే వాళ్ళకి సినిమా అవకాశాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త ప్రొడక్షన్ హౌస్ నిర్మించి తన నిర్మాణ సంస్థలో  వెబ్ సిరీస్ లను కూడా నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ కి భర్త నాగచైతన్య పేరుతో సహా తన పేరు కూడా కలిసి వచ్చేలా నామకరణం చేయాలని యోచనలో సమంత అన్నట్లు సమాచారం. మరి ఇప్పటికే సినిమాలలో తన దూకుడు చూపిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు సొంత ప్రొడక్షన్ హౌస్ మొదలు పెడితే అందులో ఎలా దూసుకుపోతుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: