వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఎదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటూ ఉంటారు. క ఏపీ రాజ‌కీయాలను దృష్టిలో పెట్టుకుని  క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు చిత్రం తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం (29-10-2019) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా  హైద‌రాబాద్‌లో ఉన్న త‌న ఆఫీస్‌లో మీడియాతో ముచ్చ‌టించారు. ఏపీ పొలిటీషియ‌న్స్ అంద‌ర్నీ కార్న‌ర్ చేస్తూ చేసిన ఈ చిత్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అయిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌, కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్‌లను పోలిన పాత్రల‌ను తీసుకుని చిత్రీక‌రించారు. 

 

ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సినిమాకు కావాల్సినంత క్రేజ్ వ‌చ్చింద‌నే చెప్పాలి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటున్నాడు వర్మ. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం జ‌ర‌గ‌లేద‌న్నారు. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నట్టుగా వెల్లడించారు. తాను ప్ర‌త్యేకించి ఎవ్వ‌రినీ ఉద్దేశ పూర్వ‌కంగా తీసుకుని వాళ్ళ‌ని కించ‌ప‌రిచే విధంగా  సినిమాలు తీయ‌న‌ని అన్నారు. త‌న‌కు ప్ర‌స్తుత సమాజంలో జ‌రిగే వివిధ ర‌కాల అంశాల పైన ఆయ‌న‌కు న‌చ్చిన అంశాన్ని మాత్రం తీసుకుని సినిమాలు చేస్తున్నాఅన్నారు. 

 

విజ‌య‌వాడ పైపుల రోడ్డు ద‌గ్గ‌ర న‌న్ను అడ్డుకున్న‌ప్పుడు నాకు ఈ సినిమా తీయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌ని అన్నారు. ఈ సినిమాను ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నానని చెప్పి కొత్త మంట పెట్టాడు. అయితే వారి పేర్లు మాత్రం అడగవద్దన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టం అంటూ తను ఇలాంటి వివాదాస్పద చిత్రాలను ఎందుకు రూపొందిస్తున్నాడో క్లారిటీ ఇచ్చాడు. నాకు ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుంది. బాగా తిట్టించుకోవటం నాకు ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నా అన్నాడు. అలాగే పాత్ర‌లు ముఖ్యం కాని సినిమాలో హీరోలు కాదు అని ఆయ‌న అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: