ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి 'బాహుబలి' సినిమా తో రాజమౌళి పుణ్యమా అంటూ అదిరిపోయే డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు అదేవిధంగా స్టార్ డైరెక్టర్లతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా బడా హీరోలు ఇటీవల సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఫ్లాపులు చూసిన హీరో షాహిద్ కపూర్ 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో 'అర్జున్ రెడ్డి' రీమేక్ హిందీలో చేసి అదిరిపోయే హిట్ అందుకొన్నాడు. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

 

ఇటువంటి తరుణంలో తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తేజ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే డైరెక్టర్ తేజ ఇండస్ట్రీలో ఎంటరైన మొదటిలో వరుసపెట్టి విజయాలు సాధించి తర్వాత అనుకోకుండా వరుసగా ఫ్లాపులు చూసిన డైరెక్టర్ తేజ ...తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రానా దగ్గుబాటి తో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఇటువంటి తరుణంలో మళ్లీ సీత సినిమా తీసి పరాజయం చూసిన తేజ తాజాగా బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఆర్టికల్ 370 కి సంబంధించిన స్టోరీ నేపథ్యం ఉన్న సినిమా తీయాలనే ఆలోచనలో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

దీనికి సంబంధించిన పాయింట్ ను తేజ ఇప్పటికే మెగాస్టార్ అమితాబ్ కు చెప్పారట.  పాయింట్ నచ్చడంతో ఫుల్ స్కిప్ట్ పై కూర్చున్నాడు తేజ. త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ ను మెగాస్టార్ అమితాబ్ కు వినిపించి అంతా ఓకే అయితే సినిమా చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ తేజ ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: