తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా అర్జున్‌ సురవరం. ఈ సినిమాలో యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కింది తాజా చిత్రం. ఎన్నో వాయిదాల, ఎన్నో అవాంతరాల తరువాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

అర్జున్‌ సురవరం చిన్న సినిమా అయినా పెద్ద మనసుతో వేడుకకు హాజరయ్యారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆద్యంతం సరదాగా గడిపారు. తన ప్రసంగంలోనూ అదే జోష్ చూపించారు. చిరు తన గురించి మాట్లాడబోతుండగా తన పేరును చెవిలో చెప్పిన నిఖిల్‌కు పంచ్‌ వేశాడు మెగాస్టార్‌. నాకు వయసు మీద పడుతుందిగా మతిమరుపు వచ్చిందనుకున్నాడు. తన పేరు చెవిలో చెపుతున్నాడన్నాడు అంటూ నవ్వులు పూయించాడు. నిఖిల్ రూపంలో నాకు మరో తమ్మడు, శిష్యుడు దొరికాడన్నారు చిరు.

 

ఈ సినిమాలోని ఓ పాటను గుర్తు చేసుకుంటూ `ఈ సినిమాలో చెగువరాకు సంబంధించిన ఓ పాట ఉందని అది చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఆ పాటను నా ఫేవరెట్‌ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ పాడారు. ఆ సాంగ్ చూస్తున్నంత సేపు, ఆ ఇమేజ్‌ చూస్తున్నంత సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా..?` అంటూ కాసేపు పాజ్‌ ఇచ్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా పవన్‌, పవన్‌ అంటూ కేకలు పెట్టారు. అప్పుడు చిరుకూడా వారిలో మరింత ఉత్సాహ నింపుతూ పవన్‌ మేనరిజంను ఇమిటేట్‌ చేస్తూ మెడ మీద తన చేతితో రుద్దుతూ అభిమానుల్లో జోష్‌ నింపారు. చెగువరా అనగానే నా బ్రదర్‌, నా తమ్ముడు పవన్‌ గుర్తొకు వచ్చాడన్నారు.

 

మొదట ఈ సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. రిలీజ్‌కు దగ్గరపడుతున్న సమయంలో ఆ టైటిల్‌ తో మరో సినిమా రిలీజ్‌ కావటంతో తప్పని సరి పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను అర్జున్‌ సురవరంగా మార్చారు. ఈ ఏడాది మే లోనే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: