తెలుగు ప్రేక్షకులకు నవ్వుల పువ్వులు పూయించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కార్యక్రమం జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి  బుల్లితెర పై ఎంతోమంది అభిమానులున్నారు. ఎప్పుడు టీవీ వైపు  చూడని వాళ్ళు కూడా జబర్దస్త్  చూసి అందులో కమీడియన్స్ చేసే కామెడీ కి పగలబడి నవ్వుకునే వారు ఎంతోమంది. జబర్దస్త్ మొదలైందంటే టీవీల ముందు కూర్చున్న వారి ముఖాలన్ని  నవ్వులతో వికసించేలా చేస్తుంది జబర్దస్త్ షో. అయితే ఎంతో మందిని అలరించిన జబర్దస్త్ షో ప్రస్తుతం సమస్యల్లో ఉంది.  ఇప్పటికే జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఉన్న మెగా బ్రదర్ నాగబాబు షో నుండి తప్పుకోవటం  పాటు కొంత మంది టీమ్ లీడర్లు  కూడా తప్పుకున్నారు. అయితే జబర్దస్త్ నుంచి తప్పుకున్న వాళ్ళందరి ప్లేస్ లో  కొత్త వారు ఎవరు రాబోతున్నారు అన్నది  కూడా ప్రస్తుతం బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది. అయితే కంటెస్టెంట్ విషయం పక్కనపెడితే జబర్దస్త్ జడ్జ్ గా  జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఉండి జబర్దస్త్ కి ఎంతో పాపులారిటీ  తీసుకురావడంతో పాటు జబర్దస్త్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా  నాగబాబు షో నుండి  తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎవరు రాబోతున్నారు  అనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. 

 

 

 

 అయితే జబర్దస్త్కు జడ్జ్  రాబోతున్నారు అంటూ చాలా మంది పేర్లు లిస్టు లో ఉన్నాయి కమెడియన్ అలీ, అల్లరి నరేష్ సాయి కుమార్ ఇంతకుముందు ఒకసారి జడ్జ్ గా చేసిన మీనా  తదితర పేర్లు లిస్ట్ లో ఉండగా తాజాగా మరో పేరు ఈ లిస్టులో వచ్చి చేరింది. ఈ లిస్ట్ లో వచ్చి చేరిన పేరు  మా అధ్యక్షుడు నరేష్ పేరు. నరేష్ జబర్దస్త్ గా రాబోతున్నాడు అని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలు నరేష్ వరకు చేరుకోవడంతో దీనిపై నరేష్ స్పందించారు. నేను జబర్దస్త్ షో కి జడ్జ్ గా  రావడం ఏంటో నాకే తెలియదు నాకు. ఏం జరుగుతుందో మీరే చూడండి. నాకు ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ తో జబర్దస్త్ జడ్జిగా చేయడానికి టైమ్ సరిపోకపోవచ్చు... కానీ జబర్దస్త్ ను  మాత్రం నేను బాగా ఎంజాయ్ చేస్తాను. జబర్దస్త్ జడ్జిగా నన్నెవ్వరు సంప్రదించలేదు . 

 

 

 ఒకవేళ జబర్దస్త్ లో జడ్జ్ గా  చేయడానికి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తా  అని చెప్తా  ఎందుకంటే ఐ లవ్ జబర్దస్త్... జడ్జ్ గా  అవకాశం వస్తే నాకున్న సమయానికి జడ్జ్ గా  పూర్తి న్యాయం చేయగలనా లేదా అని  ఓ సారి ఆలోచించుకుంటూ... ప్రస్తుతానికి నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. అంతేకాకుండా మా అధ్యక్షుడిగా పరిష్కరించాల్సిన ఇష్యులు కూడా చాలానే ఉన్నాయి. అయితే మా అసోసియేషన్ లో ఇష్యూలు  వస్తూనే ఉంటాయి.  ఎందుకంటే మా అసోసియేషన్ లో రెండుప్యానళ్లు  ఉన్నాయి కాబట్టి. అయితే జబర్దస్త్ జడ్జ్  చేసేందుకు తనకు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేసేందుకు ప్రయత్నిస్తానని నరేష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: