ఇంటిల్లిపాది హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. అంతా ఆసక్తిగా ఒక చిత్రాన్ని చూస్తున్న సమయంలో అక్కడ హీరో మరియు హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ సీన్ వస్తుంది. వెంటనే అమ్మనో లేకపోతే నాన్ననో రిమోట్ పట్టుకొని ఛానల్ మార్చేస్తారు. ఒక మూడు రోజుల తర్వాత అదే పిల్లవాడు అదే సినిమాని కేవలం ఆ సీన్ కోసమే యూట్యూబ్ లో వెతుకుతాడు. ఎవరికీ కనపడకుండా చూస్తాడు. ఇలా ప్రతి చిన్న విషయంలో అతనిలో దీనిపై ఆసక్తి రేపి చివరికి వారు పరిణతి చెందే వయసులోనే పరోక్షంగా పిల్లలు వాటి బారీన పడేందుకు తల్లిదండ్రులు కూడా కారణం అవుతున్నారు.

 

అదేసమయంలో రొమాంటిక్ సన్నివేశాన్ని ఒక మామూలు విషయంగా పరిగణిస్తే చాలా ఉత్తమమని మానసిక శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మీరు ఇంకా మోడరన్ తల్లిదండ్రుల అయితే ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా మీ కొడుకుతోనే లేదా కూతురితోనో ఇది సృష్టి మనుగడలో చాలా మాములు విషయమని... దీనిలో పెద్దగా సిగ్గు పడవలసిన అవసరం ఏమీ లేదని పిల్లలతో సన్నిహితంగా చెప్పేందుకు ప్రయత్నం చేయండి అంటున్నారు శాస్త్రవేత్తలు. వయసు పెరిగే కొద్దీ వారిలో హార్మోన్లు వృద్ధి చెందడం ద్వారా వారికి అటువంటి కోరికలు కలిగి ఫోన్ వెబ్ సైట్స్ చూసే వారిని మందలించకుండా... వాటికి మరియు నిజమైన సెక్స్ కు గల తేడాను క్లుప్తంగా వివరించడం మంచిది.

 

ఇంకా ప్రాచీన దేవాలయాలపై ఉన్న బొమ్మలను మరియు పాత కాలంలో రాసిన గ్రంథాల గురించి వారికి కొద్దిగా అవగాహన కల్పించి ఏదైనా పరిమితిలో ఉండటం మంచిది అని వారికి బోధన చేయడం ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి నుండి సెక్స్ అన్న విషయాన్ని మొహమాట పడుతూ దూరం చేయడం కంటే వారికి అర్థం అయ్యేలాగా మనసువిప్పి మాట్లాడితేనే వారు దానిని జీవ ప్రక్రియలో ఒక భాగంగా చూస్తారే తప్ప దానిని అవకాశంగా తీసుకొని అఘాయిత్యాలకు పాల్పడే సందర్భాలు చాలా అంటే చాలా తక్కువట. కాబట్టి వీలుంటే మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు పోర్న్ వెబ్సైట్స్ బారిన పడకుండా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: