టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలే కథల్లేక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ మంచి సబ్జెక్ట్ దొరికితే చాలు దానిచుట్టూ చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా రొటిన్ సబ్జెక్ట్స్, అడల్ట్ కంటెంట్ ఉన్న కథలతోనే సినిమాలు వస్తున్నాయి. అవి కాస్తా డిజాస్ట్రస్ గా మిగులుతున్నాయి. అందుకే ఇండస్ట్రీలో కథల కొరత బాగా ఉందని ఎప్పుడు వినిపిస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా టాలీవుడ్ లో ఒక బయోపిక్ రాబోతోందని న్యూస్ రాగానే అది కాస్తా సంచలనం అయింది. అంతేకాదు ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడంటు బాగా స్ప్రెడ్ అయింది. ఇంతకీ ఆ బయోపిక్ ఎవరిది అంటే టాలీవుడ్ లో యంగ్ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి అకస్మాత్తుగా చనిపోయిన ఉదయ్ కిరణ్ బయోపిక్. 

 

దాదాపు 2 రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో నలుగుతోంది. కొంతమంది ఈ బయోపిక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లు ఉంటుండగానే మరోవైపు కొన్ని పుకార్లు ఊపందుకున్నాయి. ఈ బయోపిక్ లో సందీప్ కిషన్, ఉదయ్ కిరణ్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ బీభత్సంగా ప్రచారం ప్రారంభమైంది. కానీ అలాంటిదేమి లేదంటు ఈ హీరో తాజాగా ఖండించాడు. "ఉదయ్ కిరణ్ బయోపిక్ కు సంబంధించి 2 రోజులుగా చాలా పుకార్లు వింటున్నాను. ఈ విషయంలో క్లియర్ గా క్లారిటీ ఇవాలనుకున్నాను. బయోపిక్ కు సంబంధించి ఎవ్వరూ నన్ను సంప్రదించలేదు. అంతేకాదు, ప్రస్తుతానికి బయోపిక్స్ చేసే ఆలోచన కూడా నాకు లేదు." అంటు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు.

 

ఇలా ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సాధారణంగా ఫలానా సినిమాను ఫలానా హీరో చేస్తున్నాడంటూ ఊహాగానాలు రావడం మన ఇండస్ట్రీలో చాలా కామన్. అలాంటివాటికి హీరోలు స్పందించరు. కానీ ఈ బయోపిక్ విషయంలో సందీప్ వెంటనే రియాక్ట్ అవ్వడానికి మాత్రం ఓ స్టాంగ్ రీజన్ ఉంది. ఈ బయోపిక్ గనక తెరమీదకొస్తే మెగా కాంపౌండ్ వ్యవహారాలు చాలానే చర్చకొస్తాయి. గతంలో ఉదయ్ కిరణ్ ను అల్లుడిగా చేసుకోవడానికి చిరంజీవి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ విషయాలన్ని ఈ బయోపిక్ లో ఉండబోతున్నాయి. అంతేకాదు ఉదయ్ కిరణ్ కెరీర్ మొత్తం తలకిందులవటానికి ఇండస్ట్రీలో జరిగిన రాజకీయాల్లన్ని బయటపడతాయి.

 

ఈ తలనొప్పులన్నీ నాకెందుకు అసలే ఒక్క హిట్ కూడా పడక నానా అవస్థలు పడుతున్నా అనుకొని   సందీప్ కిషన్ ఇలా ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. సందీప్ తప్పుకోవడంతో ప్రస్తుతం ఈ బయోపిక్ చుట్టూ రాజ్ తరుణ్, నాని పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లు కూడా త్వరలోనే దీనిపై క్లారిటి ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ్ కిరణ్ బయోపిక్ ఉంటుందా లెదా అన్నది తెలియడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: