పోర్న్..అనే పదం భార్యాభర్తల అనుబంధంలో ఇప్పటికీ నిషిద్ధ పదంగానే పరిగణిస్తున్నారు. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కొందరు వీటిని ఆశ్రయించేవారు. ఇలాంటి విషయాలను ఎడ్యుకేట్ చేయడానికి డాక్టర్ సమరం ఎంతో ఫేమస్. ఆయన ఎడ్యుకేట్ చేసే విధానం అందరికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రాకుండా, పిల్లలు కలిగే విషయంలో..ఇలా ఎన్నో సమస్యల మీద ఆయన సలహాలు, సూచనలు జనాలకు ఎంతో మేలును కలగజేస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాశ్చాత్య సంస్కృతి, సాంకేతికత పుణ్యమా అని పోర్న్ ఊహించనంత వేగంగా విస్తరించింది. స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పోర్న్ వీడియోలు చూసేస్తున్నారు.....చేస్తున్నారు.

 

ఇది డ్రగ్స్ తీసుకునే దానికంటే దారుణమయిన వ్యసనంగా మారుతోంది. అందుకే భారత ప్రభుత్వం వందల పోర్న్ సైట్లపై నిషేధం కూడా విధించింది. అయితే, స్త్రీ, పురుషులపై ఇది ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందోనన్న కోణంలో పరిశోధనలు చేపట్టిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సైకాలజిస్టు ప్రొఫెసర్ డియోర్‌డ్రే బారెట్.. పోర్న్ అనేది ఒక కృత్రిమ ఉత్తేజిత ఉపకరణం అని తెలిపారు. ఒక విధమైన ఉద్రేకాన్ని కలిగించే వ్యాపకమని, అది పడక గదిలో భాగస్వామితో ఉన్నపుడు కూడా కలగదని వివరించారు. ఇది లోతుగా ఆలోచిస్తే ముమ్మాటికి నిజమేనని అర్థమవుతోంది.

 

స్త్రీ, పురుషుల మధ్య పోర్న్ ఇప్పటికీ ఇబ్బందికర విషయంగా ఉందన్న ప్రశ్నకు చెన్నైకి చెందిన ఓ మహిళా కళాశాల కౌన్సెలర్ గౌరి శ్రీవాస్తవ ఆస్తకికర విషయాలు వెల్లడించారు. ‘భారత్‌లో పురుషులు పోర్న్ వీడియోలు చూడ్డానికి ఏ మాత్రం భయపడరు. కానీ, మహిళలు పోర్న్ చూస్తే దాంపత్య జీవితానికి ద్రోహం చేసినట్లేనన్న ధోరణిలో ఆలోచిస్తారు’ అని ఆమె తెలిపారు. అయితే ఇది ప్రస్తుత పరిస్థితులలో తప్పు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంతో మంది మహిళలు తన భర్తలను మోసం చేస్తు క్షణికావేశంలో మూడు క్షణాల యవ్వన కోరిక తీర్చుకోవడానికి పర పురుషులతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీని వల్ల కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు సరిగ్గా చదువుకునే వయసులో ఈ వ్యసనానికి బానిసలై జీవితాలనే సర్వనాశనం చేసుకుంటున్నారు. అయితే ఇది పిల్లలకి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా తల్లి తండ్రులే.    

మరింత సమాచారం తెలుసుకోండి: