ఎప్పుడు వివాదాలతో ఎంజాయ్ చేసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' టైటిల్ వివాదంలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఒక కులం వారిని కించపరిచేలా మరొక కులాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు ఉందని చెప్పలేనన్ని విమర్శలు వచ్చాయి. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రతిసారిలానే ఈసారి కూడా తన సినిమా పేరును మార్చేశాడు.   

 

ఇప్పుడు ఈ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరు కాస్త 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే సినిమా పేరుగా మార్చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకూడదని ప్రజా శాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశాడు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను రూపొందించారని కేఏ పాల్ ఆరోపించారు.   

 

అయితే ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సమయంలో రిలీజ్ కాకూడదని కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలో కేఏ పాల్ పాత్ర గురంచి ఆర్జీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను కేఏ పాల్‌ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది అని అన్నారు. ఆయన ప్రపంచ యుద్ధం ఆపే పనిలో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. 

 

ఈ సినిమాలో ఆయన పాత్ర విషయాన్ని ఆయన అంతగా సీరియస్‌గా తీసుకుంటారని నేను అనుకోవడం లేదని అన్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాను కేఏ పాల్ చూస్తే సూపర్ ఉంది నా పాత్రా అని నన్ను మెచ్చుకుంటారు అంటూ లైవ్ షో లో కామెడీ చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల విషయంపై హైకోర్డు మరికాసేట్టో తీర్పు ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: