వరుస విజయాలతో జోరు మీదున్న మెగా హీరో వరుణ్ తన తర్వాతి చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. గద్దలకొండ గణేష్ సినిమా అతని కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాతి నుండి తన రెమ్యునరేషన్ కూడా పెంచాడట వరుణ్. అయితే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో  బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం వరుణ్ అమెరికాలో బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.

 

 

అయితే మరి కొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్న సమయంలో అనుకోని సమస్య ఏర్పడింది. యూత్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సినిమాతో ఈ సమస్య వచ్చింది. విజయ్ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ సినిమాకి "ఫైటర్" అనే పేరును కూడా ఖరారు చేశారు.

 

 

ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత మాస్ సినిమాలు మాత్రమే తీస్తానని ప్రకటించిన పూరి ఈ సారి సరికొత్త మాస్ కథతో వస్తున్నాడట. యూత్ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి మాస్ కథని రెడీ చేశారట. అయితే ఈ సినిమాలో విజయ్ ని బాక్సర్ గా చూపించబోతున్నారట. వరుణ్ సినిమాలో కూడా బాక్సర్ కావడంతో, ఈ రెండు సినిమాల మధ్య కథలో పోలికలు ఉంటాయని భయపడుతున్నారట.

 

 

అందుకని  వరుణ్ సినిమా కథని కాస్త మార్చే ఆలోచనలో ఉన్నారట. స్క్రిప్టులో మార్పులు జరిగాకనే షూట్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకని ప్రస్తుతానికి మళ్ళీ స్క్రిప్టు పనుల్లో నిమగ్నమైపోయారట. మరి కథలో మార్పు చేసిన తర్వాతైనా ఈ రెండు సినిమాల మధ్య పోలికలు ఉండకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: