'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా టైటిల్ తో వెళ్తే... సెన్సార్ బోర్డు తప్పకుండ తిరస్కరిస్తుందని భావించిన రాంగోపాల్ వర్మ టైటిల్ లోని ఒక అక్షరాన్ని, ఒక పదాన్ని మార్చేశాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్‌ను 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చి ఈ రోజు సెన్సార్ బోర్డుకు తీసుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాను అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ పై ఒక్కో పాటను విడుదల చేసి ఈ సినిమాపై హైప్, ఇంకా హీటేకించ్చాడు రాంగోపాల్ వర్మ.


కె ఎ పాల్ పై ఒక పాటని రూపొందించి దానిని యూట్యూబ్ లో విడుదల చేసిన తర్వాత అది సంచలనమైన విషయం తెలిసిందే. కే ఏ పాల్ పై ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇది తెలుసుకున్న మతప్రచారకుడు కే ఏ పాల్...తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ ఈ సినిమాని రాంగోపాల్ వర్మ చిత్రీకరించాడని కోర్టుకెక్కారు.  అందుకేేే ఈ సినిమాని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ఒక ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. " కె పాల్ ను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి.. కే ఏ పాల్ కు అస్సలు వ్యక్తిత్వం ఉందా?" అంటూ సూటిగా ప్రశ్నించాడు.


'కుల వ్యవస్థను కించపరిచేలా సినిమా తీశారని.. ఇంకా రెండు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చాలామంది అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి?' అని ప్రశ్నించినప్పుడు...


'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది ఒక డిస్క్రిప్టివ్ టైటిల్. అది అందరికీ తెలుసు. ఒక ప్రత్యేక వర్గానికి... ఫేమస్ అయిన ప్రత్యేక ప్రదేశంలో ఎలక్షన్స్ తర్వాత వచ్చే పరిమాణాల వల్ల ఇంకొక వర్గం వచ్చింది. దీన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక సినిమా తీశాను నేను. ట్రైలర్ లో గాని, టైటిల్ లో గాని ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. పోస్టర్ లో కూడా ఇద్దరు కలిసి ఉన్నట్లుగానే చూపించాం" అంటూ వివరించాడు రాంగోపాల్ వర్మ.


అయితే ఈ సినిమాలో అన్నీ క్యారెక్టర్లను... జగన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో సహా మోడీ, అమిత్ షాలను కూడా చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలియజేశారు. కానీ టీడీపీ పార్టీలో ముఖ్య పాత్ర వహించిన బాలకృష్ణ క్యారెక్టర్ ను ఈ సినిమా ట్రైలర్ లలో, పోస్టర్ లలో, ఇంకా ఎక్కడా చూపించలేదు. దాంతో సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎందుకు కనిపించలేదు? అని ప్రశ్నించినప్పుడు... రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. " ఈ సినిమాలో బాలకృష్ణ లేరు. కానీ ఒక బుడ్డోడుని చూపించబోతున్నాం" అని చెప్పాడు.. ఆ బుడ్డోడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించేనా అని అడిగితే.. 'మీరు ఏమనుకుంటున్నారో చెబితే నేను చెబుతా' అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు వర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: