వివాదాలకు చిరునామాగా మారిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మరో వివాదంతో ముందుకొచ్చాడు. తన సినిమాలన్నింటికీ వివాదాల ద్వారానే పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. తాజాగా ఆయన తీసిన "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" సినిమా మరోసారి వివాదాస్పదం అయింది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి వివాదం మొదలైంది. అప్పటి నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది.

 

అయితే సినిమా టైటిల్ పై అనేక అభ్యంతరాలు వచ్చాయి. ట్రైలర్ విడుదలయ్యాక అందులోని పాత్రలు నిజ జీవిత పాత్రలతో పోలికలు ఉండడంతో కేఏ పాల్ తన పరువుకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారని కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఈ విషయాన్ని వర్మ సిరియస్ గా పట్టించుకోలేదు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రెండు వర్గాల మధ్య ఘర్షణని రేకెత్తించేలా ఉందని, ఎలాగైనా ఆ టైటిల్ మార్చాలని డిమాండ్ చేశారు.

 

అయితే ఈ విషయంలో సెన్సార్ బోర్డ్ కల్పించుకుని టైటిల్ మార్చాల్సిందిగా కోరగా ఈ సినిమా పేరుని "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" గా మార్చడం జరిగింది. ఇక నుండి ఈ సినిమా పేరును అలాగే పిలవాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు నెలల కాలంలో ఒక సినిమా పేరును దాని రిలీజ్ కి ముందురోజు మార్చడం ఇది రెండవసారి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన " వాల్మీకి" చిత్రానికి దాని రిలీజ్ రోజు ముందు గద్దలకొండ గణేష్ గా మార్చడం జరిగింది.

 

అయితే గద్దల కొండ గణేష్ అన్న పేరు సినిమా ఫలితాన్ని ఆపలేకపోయింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వర్మ సినిమాకి కూడా రిలీజ్ రోజు  ముందే పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడం వల్ల సినిమా హిట్ కావడంతో ఆ సెంటిమెంట్ వర్మ సినిమాకి కూడా పనిచేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్మ తనకి సెంటిమెంట్లు లేవని చెప్తాడు. మరి ఈ విషయంలోనైనా సెంటిమెంట్ పనిచేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: